CM Revanth Reddy Speech At LB Stadium

ఏపీలో పరామర్శ రాజకీయాలు సాగుతుంటే, తెలంగాణలో నీళ్ళ రాజకీయాలు సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయాలు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి.

కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత కలహాలు, పోరాటాల కారణంగా బిఆర్ఎస్ పార్టీలో అయోమయ స్థితిలో ఉన్నప్పటికీ, కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గట్టిగానే ఎదుర్కొంటున్నారు. సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానానికి డబ్బు సంచులు మోస్తున్నాడని కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేస్తున్నా రేవంత్ రెడ్డి స్పందించక పోవడం కేటీఆర్‌ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నట్లవుతోంది.

Also Read – ఆ రెండు పార్టీలు గోదావరికి బిందెలు అడ్డం పెట్టొచ్చుగా?

ఇదే సమయంలో ఆర్ధిక సమస్యలు, కాంగ్రెస్‌ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్ళ కారణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాళ్ళు చేతులు కట్టేసినట్లున్నా, బిఆర్ఎస్ పార్టీని గట్టిగానే ఎదుర్కొంటున్నారు. కేసీఆర్‌కి దమ్ముంటే శాసనసభకు రావాలని సవాళ్ళు విసురుతున్నారు.

బనకచర్ల, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్‌, ఎఫ్-1 రేసింగ్ కేసులపై శాసనసభలోనే చర్చిద్దామని సిఎం రేవంత్ రెడ్డి సవాలు విసురుతున్నారు. కానీ కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురూ ఆ సవాలు వినపడనట్లు రాజకీయాలు చేస్తున్నారు.

Also Read – పేర్ని లీక్స్…చాల వైలెంట్ గురు

వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని, కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్‌ చెప్పుకొంటున్నారు.

కానీ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్‌ సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “మా ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని లేకుంటే కూల్చేస్తామని కేటీఆర్‌ బెదిరించేవారు. కానీ మా ప్రభుత్వం 18 నెలలు పూర్తిచేసుకొని దూసుకుపోతోంది.

Also Read – ఒకరు సస్పెండ్.. మరొకరు సస్పెన్స్.. అయినా తీరు మారలే!

వచ్చే ఎన్నికలలో కూడా మేమే గెలుస్తాము. కాంగ్రెస్‌ పార్టీ 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు తప్పకుండా గెలుచుకుంటుంది. ఒక్క సీటు తగ్గినా దానిని నేనే బాధ్యత వహిస్తాను,” అంటూ సిఎం రేవంత్ రెడ్డి శపధం చేశారు.

సిఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా ఇంత నమ్మకంగా 100 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని ప్రకటించడం ఏదో ఊక దంపుడు ఉపన్యాసంగా కొట్టి పడేయలేము. ఏడాదిన్నార పాలనపై నిఘా వర్గాల ద్వారా ఫీడ్ బ్యాక్ తెప్పించుకునే ఆ మాట అని ఉండవచ్చు.

రాష్ట్రంలో బీజేపి, బిఆర్ఎస్ పార్టీల పరిస్థితిని, వాటి అంతర్గత సమస్యలని అన్నిటినీ పరిగణనలోకి తీసుకునే వచ్చే ఎన్నికలలో గెలుస్తామని చెప్పి ఉండవచ్చు. 100 కి ఒక్క సీటు తగ్గినా నాదే బాధ్యత అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఆయనలో పెరిగిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా భావించవచ్చు.

ఈదీగాక 2023 ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని ఓడిస్తానని రేవంత్ రెడ్డి ముందే శపధం చేసి నెగ్గించుకున్నారు. కేసీఆర్‌ని జైలుకి పంపించి చిప్ప కూడు తినిపిస్తానని మరో శపధం చేశారు. దానిని నెరవేర్చుకునేందుకు ఫోన్ ట్యాపింగ్‌ కేసు విచారణని వేగవంతం చేశారు. కనుక ఏదో ఆ కేసులో కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలను జైలుకి పంపించే అవకాశం కనిపిస్తోంది. అందువల్లే 2028 ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోగలనని సిఎం రేవంత్ రెడ్డి చాలా నమ్మకంతో ఉన్నట్లు భావించవచ్చు.