సంచలన బొగ్గు కుంభకోణం కేసులో తొలి తీర్పు!

coal scamదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు తొలి తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా తేలిన జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఆర్ఎస్ రుంగ్తా, ఆర్సీ రుంగ్తాలు జాతి ప్రయోజనాలను దెబ్బకొడుతూ, ప్రభుత్వాలను మోసం చేశారని తేలినందున వీరికి నాలుగేళ్ల జైలు శిక్షను, 5 లక్షల జరిమానాను విధిస్తున్నట్టు న్యాయమూర్తి భరత్ పరాశర్ తీర్పిచ్చారు.

ADVERTISEMENT

ఆపై జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ 25 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. కాగా, కోర్టు ఆదేశాల మేరకు నిందితులు ఇద్దరినీ గత వారంలోనే పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు సహా పలువురు ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటుండగా, పదుల సంఖ్యలో కేసులు విచారణ దశలో ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories