జనసేనను దెబ్బకొడుతోన్న జగన్!

Comedian Prudhvi supports ys jagan padayatraఈ సారి ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని భావిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమ నుండి కూడా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే జగన్ పాదయాత్రలో పోసాని కృష్ణమురళీ పాల్గొని తన పూర్తి మద్దతును ప్రకటించడమే కాకుండా, వచ్చే ఎన్నికలలో జగన్ కు ఓ అవకాశం ఇవ్వండి, మీ అందరికీ మంచి చేస్తారంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. అయితే పోసాని గత నాలుగేళ్ళుగా జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న రీత్యా, ఈ పరిణామం ఆశ్చర్యాన్ని కలిగించలేదు.

అయితే తాజాగా ఇదే బాటలో ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ కూడా చేరారు. మెంటేపూడి క్రాస్ వద్ద జగన్ పాదయాత్రలో భాగస్వామి అయిన పృధ్వీరాజ్ పూర్తి స్థాయిలో తన మద్దతు ప్రకటించాడు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ నుండి బరిలోకి దిగడానికి పృధ్వీ రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న టాక్ ఊపందుకుంది. గతంలో ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో పరోక్షంగా దీనిని అంగీకరించిన పృధ్వీ, ప్రస్తుతం దానిని కార్యరూపంలోకి ఇచ్చే పనిలో ఉన్నారని స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

మరో పక్కన ఎన్నికల బరిలోకి టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటున్నప్పటికీ, పోసాని, పృధ్వీ వంటి వారు వైసీపీకి మద్దతు ఇవ్వడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అవకాశాల కోసం భజనలు చేయడం తప్ప, వీరికి అంతకు మించి ఏమీ తెలియదని, నిజంగా ప్రజలకు మంచి జరగాలంటే జనసేనకు మద్దతు పలికి ఉండవచ్చు కదాయని అంటున్నారు. ముఖ్యంగా పవన్ పర్యటన కూడా జరుగుతున్న సమయంలోనే టాలీవుడ్ నుండి వైసీపీలోకి చేరిక అవుతుండడం గమనించదగ్గ పరిణామం.

https://sconten

ADVERTISEMENT
Latest Stories