భగీరథ్‌కు బెయిల్… బండికి ఊరట.. కేసు కంచికేనా?

Bandi Bhagirath Gets Bail in POCSO Case

మైనర్ బాలికను లైంగికంగా వేధించినందుకుగాను పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అతనిని పోలీసులు మే 16న అరెస్ట్ చేసి రిమాండ్ మీద చర్లపల్లి జైలుకి తరలించగా అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. ఇప్పుడు బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఇది బండి భగీరథ్‌కు, అతని తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి కూడా చాలా ఊరట కలిగించేదే. వర్తమాన పరిస్థితిలో ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబందించిన కేసులలో బెయిల్‌పై విడుదలవడం అంటే కేసు అటకెక్కిపోయినట్లేనని జనాభిప్రాయం లేదా ఆ కేసు విచారణ ఏళ్ళ తరబడి అంతూపొంతూ లేకుండా కొనసాగిస్తూ శిక్ష పడకుండా తప్పించుకునే వెసులుబాటు అని మరికొందరి అభిప్రాయపడుతుంటారు. ఇందుకు పలువురు రాజకీయ నాయకుల కేసులే నిదర్శనంగా ఉన్నాయి కూడా.

ADVERTISEMENT

కనుక బండి భగీరథ్‌ కేసు కూడా ఇలాగే ముగియబోతోందా?లేదా ఇది చాలా తీవ్రమైన నేరారోపణతో నమోదైన పోక్సో కేసు కనుక, రాజకీయాలకు అతీతంగా విచారణ వేగవంతంగా సాగుతుందా? అనేది రాబోయే రోజుల్లో అందరూ చూస్తారు.

ADVERTISEMENT
Latest Stories