పోరాటాలే కాదు పూరీలు కూడానా.?

revanth-reddy-makes-puris-for-grandson

ఎప్పుడు రాజకీయాలతో బిజీ బిజీగా ఉండే రాజకీయ నేతలు కుటుంబ సభ్యులతో సరదా సమయం గడుపుతారా.? అసలు గడిపితే ఎలా ఉంటుంది అనే ఆసక్తి సామాన్య ప్రజానీకానికి ఉంటుంది.

అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడి కోరిక మేరకు పూరీలు తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎప్పుడు ప్రత్యర్థి పార్టీల నేతలను తన మాటలతో, విమర్శలతో చీల్చి చెండాడే సీఎం రేవంత్ కామ్ అండ్ కూల్ గా మనవడు రేయాన్ష్ కోసం వంటగదిలో స్వయంగా పూరీలు చేసారు.

ADVERTISEMENT

తాత నువ్వు పూరీలు వేస్తేనే తింటా అంటూ మానవుడు అడిగితే ఇక తప్పుతుందా.? అంటూ తానూ చేసిన ఈ పూరీల వీడియో ని తన X లో పోస్ట్ చేసారు రేవంత్. దీనితో రేవంత్ కి రాజకీయ పోరాటాల తో పాటుగా పూరీలు చేయడం కూడా తెలుసునా అంటూ నెటిజన్లు, రేవంత్ అభిమానులు ఈ వీడియో ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అయితే నిత్యం ప్రజా జీవితంలో ఉండే రాజకీయ నాయకులకు కూడా రాజకీయాల నుంచి కాస్త ఆటవిడుపు కోసం కుటుంబ సభ్యులతో ఇలా సరదగా సమయం గడపడం, వారి కోసం వంటలు చేసి వారిని తృప్తి పరచడం కూడా అవసరమే అంటున్నారు వీక్షకులు.

ఎప్పుడు తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తన విమర్శలతో ప్రత్యర్థి పార్టీల నేతలను వేయించే రేవంత్ ఇప్పుడు మనవడి కోసం పూరీలు వేయించడం చాల క్యూట్ గా ఉందంటున్నారు రేవంత్ అభిమానులు. అయితే రేవంత్ రాష్ట్ర సీఎం గా ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ మనవడికి తాతేగా…అంతేనా…!

ADVERTISEMENT
Latest Stories