ఒకప్పటి టాలీవుడ్ టాప్ కమెడియన్ వేణుమాధవ్ వైసీపీ అధినేత జగన్ ను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టిడిపి తరపున ప్రచారం చేసిన వేణుమాధవ్… “నిజానికి తాను ప్రచారానికి రాలేదని, కేవలం మెజార్టీ ఎంతోస్తుందో తెలుసుకోవాలని మాత్రమే వచ్చానని, టిడిపి తరపున కూడా జగన్ మోహన్ రెడ్డే బాగా ప్రచారం చేస్తున్నారని, ఆయన ఇలాగే ప్రచారం చేస్తే మెజార్టీ మరింత పెరగడం ఖాయమంటూ” వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే.
తాజాగా మరోసారి అంతే వ్యంగ్యంగా చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన సందర్భంలో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గారిపై బెంగ వచ్చి, ఉరకనే కలవడానికి వచ్చానని చెప్పిన ఈ ‘నల్లబాలు… జగన్ పాదయాత్రపై స్పందిస్తూ… “చాలా కష్టపడుతున్నారు, ఆయన్ని చూస్తే జాలేస్తోంది, అయిదు రోజులు పాదయాత్ర చేయాలి, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ రావాలి, అంత ఇబ్బంది పడుతున్నారు… వారి కష్టం ఎవరూ తీర్చలేనిది” అంటూ ఎటకారపు డైలాగ్స్ వేసారు. చివరికి జగన్ పరిస్థితి ఇలా అయిపొయింది అంటూ వ్యాఖ్యానించడం చూపరుల వంతవుతోంది.


