రాజధాని లేని ఏపీకి ఇన్నిపేర్లా… ఏందిది తులసిరెడ్డీ?

Tulasi Reddyరాష్ట్ర విభజనతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఏపీ కాంగ్రెస్ నేతలకు వైసీపీ రాజకీయ ఆశ్రయం కల్పించడంతో వారు ఒడ్డున పడ్డారు కానీ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా మునిగిపోయింది. అయితే ఇప్పుడు వైసీపీ కూడా మునిగిపోబోతోందని, కనుక దానిలో చేరిన కాంగ్రెస్‌ నేతలందరూ వెనక్కు తిరిగివచ్చేయాలని ఏపీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు తులసిరెడ్డి పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికలలోగా సిఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా జైలుకి వెళ్ళవచ్చని కనుక ఆ పార్టీ మునిగిపోవడం ఖాయం అని తులసిరెడ్డి అన్నారు.

ADVERTISEMENT

గురువారం ఆయన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సాలూరు గ్రామంలో పర్యటించినప్పుడు అక్కడ విలేఖరులతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు.

“సిఎం జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. వైసీపీ పని కూడా అయిపోయింది. కనుక ఆ పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలు అందరూ వీలైనంత త్వరగా కాంగ్రెస్‌లో వచ్చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ పాలన పట్ల రాష్ట్ర ప్రజలలో తీవ్ర అసహనం నెలకొంది. జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌, అవినీతి ఆంధ్రప్రదేశ్‌, అరాచక ఆంధ్రప్రదేశ్‌, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్‌, గంజాయి ఆంధ్రప్రదేశ్‌, మద్యం ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు.

రాష్ట్రం ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, భూమాఫియా, మద్యం మాఫియా, ఎర్రచందనం మాఫియా చివరికి సబ్సీడీ బియ్యం మాఫియాల రాజ్యంగా ఆంధ్రప్రదేశ్‌ మారిపోయింది. కనుక రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా… ఈ సిఎం జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నేతలను గద్దె దించేద్దామా? అని ఎదురుచూస్తున్నారు,” అని తులసి రెడ్డి అన్నారు.

అష్టోత్తరంతో దేవతామూర్తులను స్తుతించిన్నట్లుగా దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తులసి రెడ్డి ఇన్నిపేర్లతో వర్ణించి చెప్పారు. ఆయన చెప్పినవన్నీ చేదు నిజాలే అయినప్పటికీ ఏపీ గురించి ఈవిదంగా వినవలసి రావడం చాలా బాధాకరం.

ఏపీని ఈ దుస్థితికి రావడానికి కాంగ్రెస్ పార్టీ కూడా కారణమే అని, అందుకే ఏపీ ప్రజలు తమని శిక్షించారని ఆయనకు కూడా తెలుసు. ఆ పార్టీ నేతలందరూ వైసీపీ పంచనచేరి ఏపీలో ఇంత అవినీతి,అక్రమాలకు పాల్పడ్డారని చెపుతున్నప్పుడు, మళ్ళీ వారందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానిస్తుండటం గమనిస్తే, కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ఏదోవిదంగా రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ముఖ్యం తప్ప మంత్రులు, ఎమ్మెల్యేల క్యారెక్టర్ ముఖ్యం కాదని భావిస్తున్నట్లు అర్దమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories