కాషాయ పార్టీకు కాంగ్రెస్ రంగు పూసే ప్రయత్నంలో పురంధేశ్వరి!

Daggubati Purandeshwari in Search of a New Seatఎన్డీయే ప్రభుత్వం నుండి టీడీపీని వెళ్లగొట్టడంలో కీలక పాత్ర పోషించిన పురంధేశ్వరి అనుకున్న కార్యం సిద్దించడంలో ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే ఇప్పుడు ఆమె పార్టీని తన గ్రిప్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీనిలో భాగంగా తనకు అనుకూలమైన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణను ఆమె గట్టిగా సిఫార్సు చేస్తున్నారని సమాచారం. కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుండి పురంధేశ్వరికి చాలా అనుకూలమైన వ్యక్తి. ఆయన అధ్యక్షుడైతే పార్టీని తన చెప్పుచేతల్లో ఉంచుకోవచ్చని ఆమె ఉద్దేశం. అయితే సంఘ్ మాత్రం మాణిక్యాలరావు వైపు చూస్తుందని సమాచారం.

ADVERTISEMENT

సోము వీర్రాజు, మాణిక్యాలరావు, మరియు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడి రేస్ లో ఉన్నట్టు సమాచారం. సోము వీర్రాజు దాదాపుగా రేసులో లేనట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల అనంతరం దానిపై ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories