ఇక్కడ దసరా అక్కడ బతుకమ్మ…

Women celebrating Bathukamma and families enjoying Dasara festivals in Telugu states

నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఏపీలో నవరాత్రుల దసరా సంబరాలు మొదలైతే తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు షురూ అయ్యాయి.

అలాగే నేటి నుంచి ఏపీ, తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు దసరా సెలవలు, బతుకమ్మ హాలిడేస్ మొదలవ్వగా కాలేజీ విద్యార్థులకు మాత్రం ఈ నెల 28 నుంచి సెలవలు ప్రకటించాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు.

ADVERTISEMENT

పిల్లలకు హాలిడేస్ తో ఎంజాయ్ మెంట్ రాగ పెద్దలకు ఫెస్టివల్ ఆఫర్స్, బిగ్ బిలియన్ డేస్ అంటూ ఆన్ లైన్ షాపింగ్ తో హడావుడి మొదలు. ఇక మహిళలకు బతుకమ్మ కూర్పులు, అమ్మవారి అలంకారాలు అంటూ వారి వారి పూజా కార్యక్రమాలతో, ఆధ్యాత్మిక సేవలలో బిజీగా గడుపుతారు.

అలాగే దసరా హాలిడేస్ లో ఫ్యామిలి ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటూ ఎంజాయ్ చేసే బ్యాచ్ మరికొంతమంది. ఇలా ఎవరు కి వారు ఈ దసరా, బతుకమ్మ హాలిడేస్ హడావుడిని ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఈ శరన్నవరాత్రుల శోభతో విజయవాడ ఇంద్రకీలాద్రి వెలిగిపోతుంది.

నేడు నవరాత్రులలో మొదటి రోజు కావునా అమ్మవారు “బాలాత్రిపుర సుందరి దేవి” అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దీనితో అమ్మవారి దర్శనానికి వేలాది మంది దుర్గమ్మ భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రి దగ్గర బారులు తీరారు. అలాగే భవానీలు సైతం అమ్మవారి దర్శనం కోసం విజయవాడకు తరలివస్తున్నారు.

ఇక రంగు రంగుల పువ్వులతో అలంకరణ చేస్తూ బతుకమ్మను సిద్ధం చేస్తూ బతుకమ్మ నాట్యాలతో మహిళలందరు చేరి బతుకమ్మను పూజిస్తారు. అయితే నేడు ఈ కార్యక్రమం “అటుకుల బతుకమ్మ” రూపంలో జరుపుకుంటారు. ఇలా ఏపీలో దసరా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories