రాష్ట్రంలోనే సంచలనంగా మారిన వివేకా హత్య కేసులో నాలుగున్నరేళ్ళగా న్యాయం కోసం పోరాడుతూనే ఉంది వివేకా కూతురు సునీతా రెడ్డి.తమకు న్యాయం జరగాలని, నిందితులకు శిక్ష పడాలని సొంత కుటుంబసభ్యులైనా అవినాష్ రెడ్డి పాత్ర ఇందులో ఉందంటూ పలు అనుమానాలను కూడా వ్యక్తపరిచారు సునీతా.
అధికార పార్టీలో కొందరు ముఖ్యనేతలు ఈ కేసుపై ఎన్నోఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ కేసులో అప్రూవర్ గా మారిన వివేకా కారు డ్రైవర్ దస్తగిరి కిడ్నాప్ కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లారు. దీనిపై ఆయన భార్య షబానా పలు అనుమానాలను వ్యక్తపరిచింది. నా భర్త పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి అక్కడ ఆయనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
పరిటాల హత్య కేసులో అప్రూవర్ గా మారిన మొద్దు శీను మాదిరే తన భర్త దస్తగిరిని కూడా జైల్లోనే హత్య చేస్తారని ఆరోపిస్తున్నారు షబానా. అయితే దస్తగిరి ద్వారానే వివేకా హత్య కేసులో ఎప్పటికైనా నిజాలు బయటకు వస్తాయి తద్వారా అసలైన నిందితులు జైలుకు వెళ్ళాలసిందే. కాబట్టి దస్తగిరిని హత్య చేయవలసిన అవసరం ఎవరికుందో..షబానా అనుమానపు చూపులు ఎవరి వైపో ఇప్పటికే అందరికి తెలిసుంటది.
దస్తగిరికి కూడా మొద్దు శీను పరిస్థితే రాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అక్కడి జైలు అధికారులదే. కాకపోతే ఇక్కడ దస్తగిరితో ప్రమాదం పొంచి ఉంది కూడా ఈ ప్రభుత్వానికి కావడంతో షబానా అనుమానాలకు బలం చేకూరుతుంది.




