Pawan Kalyan Anitha Vangalapudi

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ హోంమంత్రి అనిత వంగలపూడి, పోలీస్ అధికారులపై విరుచుకుపడటం, ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో దానికి ఆయన చెప్పిన కారణాలు, ఆ తర్వాత అనిత వంగలపూడి సచివాలయంలో ఆయన ఛాంబర్‌కి వెళ్ళి మాట్లాడటం, వారిరువురూ అన్నా చెల్లెళ్ళా హాయిగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం అన్నీ పరస్పరం భిన్నమైనవే.

పవన్‌ కళ్యాణ్‌ ఆవిదంగా మాట్లాడినప్పుడు “అప్పుడే టిడిపి, జనసేనల మద్య చిచ్చు మొదలైంది… రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయనే స్వయంగా ధృవీకరించారు… కూటమి ప్రభుత్వంలో అందరూ పవన్‌ కళ్యాణ్‌ని ద్వితీయశ్రేణి పౌరుడిగా చులకనగా చూస్తున్నారంటూ,” రకరకాల విశ్లేషణలు వచ్చాయి.

Also Read – ప్రభుత్వాలు చేతులు కట్టేసుకునే పరిస్థితి దాపురించిందా?

ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో తన ఆవేశానికి ఆయన చెప్పిన కారణం విన్నప్పుడు, ‘అయితే రాష్ట్రంలో ఆడబిడ్డల గురించి కాదన్న మాట… తన పిల్లల బాధ చూడలేకనే అలా మాట్లాడారన్న మాట,’ అని వైసీపి తాపర్యం చెప్పింది.

ఆ తర్వాత హోంమంత్రి అనిత వంగలపూడి పవన్‌ కళ్యాణ్‌ని వెళ్ళి కలిసినప్పుడు, అంతకు ముందు రోజు ద్వితీయశ్రేణి పౌరుడని అభివర్ణించినవారే కూటమి ప్రభుత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హవా నడుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ ఒక్క మాట అనేసరికి చంద్రబాబు నాయుడు పోలీస్ శాఖలో బదిలీలు చేపట్టారు. వైసీపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేయిస్తున్నారు,” అంటూ మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌ని ఆకాశానికి ఎత్తేశారు.

Also Read – టీడీపీకి ఇలాంటి రాజకీయాలు అవసరమా?

కానీ ఈ పరిణామాలు టిడిపి, చంద్రబాబు నాయుడి వీర భక్తులను ఆలోచింపజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మిత్రధర్మం పాటించి పవన్‌ కళ్యాణ్‌కి, అభిప్రాయాలకు అంత గౌరవం ఇస్తున్నారా?లేదా కేంద్రానికి, రాష్ట్రానికి మద్య పవన్‌ కళ్యాణ్‌ అనే బలమైన ‘లింక్’ చాలా అవసరమని గౌరవిస్తున్నారా?అని చర్చించుకుంటున్నారు.

కానీ ఇటువంటి విషయాలు పవన్‌ కళ్యాణ్‌ బహిరంగంగా కాక నేరుగా చంద్రబాబు నాయుడికే చెప్పి ఉంటే బాగుండేది. కానీ నేరుగా చెప్పడం కంటే బహిరంగంగా చెప్పడం వల్లనే దాని ‘ఇంపాక్ట్’ ఎక్కువగా ఉంటుందని పవన్‌ కళ్యాణ్‌ భావించి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read – జగన్ లక్కీ ఆర్ అన్ లక్కీ..?

ఏది ఏమైనప్పటికీ కూటమిలో అందరూ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో బాగా నేర్చుకున్నారని ఈ పరిణామాలతో అర్దమవుతుంది. ఇది కూటమి ప్రభుత్వంలో చిన్న కుదుపువంటిదే అని చెప్పక తప్పదు. కనుక కూటమిలో వేలు పెట్టేందుకు వైసీపికి మళ్ళీ ఇటువంటి అవకాశాలు ఇవ్వకుండా అందరూ జాగ్రత్త పడితే అందరికీ మంచిది.