ఉండవల్లికి అమరన్ వ్యవహారం గుర్తులేదా.?

Did Undavalli Forget the Amaron Exit From Andhra Pradesh?

ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న సీఎం చంద్రబాబు తన సొంత రాష్ట్రంలో తన వ్యాపార వ్యవహారాలను ఎందుకు నడపరు.? ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టరు అంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఇదే ప్రశ్న ఉండవల్లి వైసీపీ ని ఎందుకు అడగరు.? జగన్ ను ఎందుకు నిలదీయరు.?

జగన్ తో సహా వైసీపీ లో కూడా అనేకమందికి దేశంలో ఇతర రాష్ట్రాలలో పరిశ్రమలు ఉన్నాయి, అలాగే విదేశాలలో వ్యాపార వ్యవహారాలు ఉన్నాయి. కానీ ఆ పార్టీ నుంచి ఏ ఒక్కరు ఏపీలో పెట్టుబడులు పెట్టలేదు, పెట్టేందుకు సిద్ధంగా లేరు.

ADVERTISEMENT

అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయాలను ఒక్కసారి గమనిస్తే కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే తమ అధికారాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా ప్రత్యర్థి రాజకీయ పతనం కోసం, వారిని ఆర్థికంగా దెబ్బకొట్టడం కోసం వినియోగిస్తున్నారు.

ఇందుకు గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలే ప్రత్యక్ష ఉదాహరణలు. టీడీపీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ అమరన్ బ్యాటరీ కంపెనీ విషయంలో వైసీపీ చూపిన అత్యుత్సాహం తో అమరన్ తెలంగాణకు పరుగులు పెట్టింది.

అలాగే పవన్ సినిమాల విషయంలో వైసీపీ ప్రదర్శించిన అధికార దుర్వినియోగాలు, ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సినీ పరిశ్రమతో వారు చేసిన టిక్కెట్ రేట్ల రాజకీయం ఇప్పటికి ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి.

ఇక అటువంటి పరిస్థితులలో వైసీపీ లాంటి రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే కేవలం తమ ప్రత్యర్థిని దెబ్బ కొట్టడానికి ఎంత దూరమైన వెళ్తుంది, ఎన్ని కుటుంబలనైనా రోడ్డున పడేస్తుంది.

మరి ఇటువంటి వారిని నమ్మి ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలు సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయా.? వాటి పర్యవసానాల ఫలితంగా అది ప్రత్యర్థి నాయకుడికే కాదు రాష్ట్రానికి కూడా చేటే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories