‘బ్రహ్మోత్సవం’ పుకార్లపై ‘ఫుల్’ క్లారిటీ!

Differences between Mahesh babu and Srikanth addalaశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “బ్రహ్మోత్సవం”పై ఇటీవల రకరకాల వార్తలు హల్చల్ చేసాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల – ప్రిన్స్ మహేష్ బాబుకు మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయని, దర్శకుడు శ్రీకాంత్ కధ చెప్పిన దానికి, సినిమా తీస్తున్న దానికి పొంతన ఉండడం లేదని, అప్పటికప్పుడే స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడని, దీని వలన సినిమా ఆలస్యమవుతోందని, దీంతో విసుగు చెందిన మహేష్, దర్శకుడిపై అసహనం వ్యక్తం చేసారని… ఇలా రకరకాల పుకార్లు ‘బ్రహ్మోత్సవం’ కేంద్రంగా తిరిగాయి.

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఇలాంటి సంఘటనలేమీ అసలు సెట్ లో చోటు చేసుకోలేదని, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమాను మానవ సంబంధాలను మిళితం చేస్తూ ప్రతి ఒక్కరిని భావోద్వేగాలకు గురి చేసే విధంగా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని… అసలు ఇలాంటి వార్తలకు తావు లేదని, ఇవన్నీ ఒట్టి పుకార్లుగా చిత్ర యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ప్రిన్స్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ‘బ్రహ్మోత్సవం’ టార్గెట్ చేసుకుని సృష్టిస్తున్న పుకార్ల సృష్టికర్తలు ఎవరో గానీ, వారి శ్రమకు సరైన ఫలితాలు ఉండవు అంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories