జగన్ ‘బలం’…బాబేనా..?

Jagan

2019 నుంచి 2024 వరకు ఈ ఐదేళ్లు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల మీద, ఆ పార్టీ నాయకుల మీద, ఆ పార్టీ కార్యకర్తల మీద వైసీపీ ప్రభుత్వం చేసిన దౌర్జన్య కాండను, దమన నీతిని విశ్లేషించడానికి, వర్ణించడానికి కూడా వీలు లేకుండా మీడియా స్వేచ్ఛను, పత్రికా స్వాతంత్య్రాన్ని కూడా హరించారు అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్.

తానూ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఉక్కు పాదంతో తొక్కిన జగన్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను అణిచివేసి సామాన్యుడు నుండి సెలబ్రెటి వరకు అందరి పై బూతులతో విరుచుకుపడ్డారు. తాను చెప్పిందే చట్టం, చేసిందే న్యాయం అన్నట్టుగా చంద్రబాబు మొదలుకుని పవన్ కళ్యాణ్ వరకు అందరి మీద తన జులుం ప్రదర్శించారు.

ADVERTISEMENT

రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో, అరాచకాలకు అత్యంత దగ్గరలో ఉంచి అవినీతి పాలన చేసిన జగన్ ప్రతిపక్షంలోకి రాగానే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ వైసీపీ డిక్షనరీ లో లేని పదాలను ఉపయోగిస్తున్నారు.

14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడిగా ఉన్న బాబుకి వైసీపీ ప్రభుత్వంలో కనీస విలువ, గౌరవం ఇవ్వని జగన్ ఇప్పుడు మాత్రం తనకు ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా బాబు ఇవ్వాలని పట్టుబట్టడం ఆయన నియంత మూర్కత్వనికి, బాబు దార్శికతకు నిదర్శనం.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే చాలు ఆయా నేతల మీద కేసులు, అరెస్టులు, జైళ్లు. ఈ ప్రస్థానం అక్కడితో ఆగకుండా పార్టీ కార్యాలయాల మీద దాడులకు తెగబడడం, వారి కుటుంబంలోని మహిళల మీద నీచాతినీచమైన ఆరోపణలు చెయ్యడం జగన్ హాబీలలో ఒకటిగా మారిపోయింది .

ఈ జగన్ బాధితుల లిస్టులో ముందువరుసలో ఉంటారు బాబు, పవన్ లు. అయితే ఇప్పుడు అధికార పక్షం విపక్షమయ్యింది, విపక్షం అధికార పక్షమయ్యింది. అయినా జగన్ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇప్పటికే తనదే అధికారం మిగిలిన వారంతా తన కింద బానిసలు అనే ధోరణిలోనే జగన్ వ్యవహార శైలి ఉంటుంది.

చేతిలో పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలను పెట్టుకుని రాష్ట్రంలో జగన్ చేస్తున్న రాజకీయ రచ్చ రోజురోజుకి హద్దులు దాటుతుంది. తన హయాంలో ప్రభుత్వం పై గొంతెత్తితే పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని లాఠీలకు పనికల్పించిన జగన్ ఇప్పుడు అదే వ్యస్థను మీడియా సాక్షిగా బెదిరించే పరిస్థితికి వచ్చారు.

అధికారంలో లేకపోతేనే పోలీస్ వ్యవస్థను ఈ స్థాయిలో కంట్రోల్ చేయడానికి చూస్తున్న జగన్ ఇక అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈ వ్యవస్థలను ఏ విధంగా ఏమార్చి ఉంటారో ఊహించుకోవచ్చు.

పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో దశాబ్ద కాలం పాటు అధికారాన్ని అనుభవించిన బిఆర్ఎస్ ఓటమి చెందగానే సద్దుమణిగింది. అలాగే కేసీఆర్, జగన్ మాదిరి ఈ తరహా రాజకీయంతో రాష్ట్ర పరువును బజారుకు లాగడం లేదు. అంటే కేసీఆర్ కు జగన్ మాదిరి రాజకీయ విధ్వంసం చేసే సమర్థత లేదనుకోవాలా? లేక రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చెయ్యగలిగారనుకోవాలా?

కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇంకా కుదుటపడనే లేదు అప్పుడే జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ మరో రాజకీయ క్రీడకు తెరలేపారు. అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే అయినప్పటికీ వ్యవస్థలను తన అధీనంలో ఉంచుకోవడానికి జగన్ ఏ స్థాయికైనా దిగజారుతారు అనే మరోసారి రుజువు చేసుకున్నారు. ఇటువంటి వారిని కట్టడి చేసి కంట్రోల్ లో పెట్టకపోతే బాబు అనుభవం, పవన్ త్యాగం, బీజేపీ చేయూత మూడు మట్టిపాలయినట్టే.

జగన్ పై బాబు ఉపేక్ష జగన్ తన బలంగా మార్చుకుంటున్నారు. పొరుగు రాష్ట్రంలో ప్రతిపక్షాలను అధికారంలోకి వచ్చిన వారం రోజులకే కట్టడి చేసి రాష్ట్రంలో ఇటువంటి వాతావరణానికి ఫుల్ స్టాప్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. మరి బాబు అధికారంలోకి వచ్చి నెల గ డుస్తు న్నా ఇంకా వైసీపీ నోటికి చేతికి కళ్లెం వేయలేకపోతున్నారు. ఏపీ అభివృద్ధికి బాబు ముందు చూపు, అనుభవంతో పాటు జగన్ మౌనం కూడా అత్యంత కీలకం.

ADVERTISEMENT
Latest Stories