ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 ఏళ్ళ జగన్ పాలనని చూసిన తర్వాత అందరూ బుద్ధిగా చంద్రబాబు నాయుడు మొహం చూసి టిడిపి కూటమికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారు. కనుక టిడిపి కూటమి పాలన అందుకు పూర్తి భిన్నంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఎదురుచూస్తున్నారు.
Also Read – పోలీస్ వ్యవస్థకు మద్దెల దరువేగా.?
సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశలోనే ముందుకు సాగుతున్నారు. కనుక ఇక చంద్రబాబు నాయుడు తమ జోలికి రారని, ఏమీ చేయరని జగన్ అండ్ కోకి పూర్తి నమ్మకం కలిగిన తర్వాత మళ్ళీ అందరూ రెచ్చిపోతున్నారు.
నాడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని ఎంతగా ఈసడించుకునేవారో ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే ఈసడించుకుంటున్నారు. వారి దూకుడు చూసి ‘జగన్ బ్యాచ్’ని సిఎం చంద్రబాబు నాయుడు కట్టడిచేయడం లేదని టిడిపి తమ్ముళ్ళు ఆవేశపడిపోతున్నారు.
Also Read – అన్న అలా…చెల్లి ఇలా..!
అలాగని సిఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా చేతులు కట్టుకొని కూర్చోలేదు. ఇప్పటికే పలువురు వైసీపి నేతలపై కొన్ని కేసులు నమోదయ్యాయి. కొందరు జైలుకి వెళ్ళివస్తున్నారు కూడా. కనుక ఏదో రోజు జగన్‌తో సహా వైసీపిలో రెచ్చిపోయిన వారందరూ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టమవుతోంది.
ఇటీవల తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్, వైసీపి అడ్డుగా దొరికిపోయారు. కనుక టిడిపి ఉచ్చులో వైసీపి చిక్కుకున్నట్లే కనిపిస్తోంది.
Also Read – జగన్ ఉత్తర కుమారుడేనా?
కానీ టిడిపి కూటమి ప్రభుత్వం జగన్, పెద్దిరెడ్డి, కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటివారి జోలికి వెళ్ళకుండా, ప్రకాశం బ్యారేజిలో మూడు పడవల కేసు, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్-మాధురీలు రీల్స్ చేశారంటూ కేసులు నమోదు చేస్తుండటం గమనిస్తే వైసీపి ఉచ్చులో టిడిపి చిక్కుకుని విమర్శల పాలవుతున్నట్లు అనిపిస్తోంది.
నిజనికి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధూరీ కలిసి తిరుమలకి వచ్చినప్పుడే టిడిపికి అనుమానం కలిగి ఉండాలి. కనుక వారి జోలికి పోకుండా దూరంగా ఉండి గమనిస్తే వారే అతిచేసి దొరికిపోయేవారు. కానీ వారు రీల్స్ చేశారంటూ తిరుపతి వన్ టౌన్ పోలీసులు వారిపై కేసు నమోదు చేయడంతో, వారు మీడియా ముందుకు వెళ్ళి రచ్చరచ్చ చేస్తున్నారు.
ఇది చూస్తే వైసీపి పన్నిన ఉచ్చులో టిడిపి కూటమి ప్రభుత్వం చిక్కుకున్నట్లే అనిపిస్తోంది.
కనుక ఇకనైనా టిడిపి కూటమి ప్రభుత్వం చిన్న చేపల కోసం ఆరాటపడటం మానుకుంటే మంచిది. లేకుంటే టిడిపిని బిజీగా ఉంచి తాము సేవ్ అయ్యేందుకు జగన్ ఇలాంటి చిన్న చేపలను వదులుతూనే ఉంటారు.
—