జగన్ అక్రమాస్తుల కేసుల్లో మరో 170 కోట్లు హాంఫట్!

Why Electorate Directorate Transferred Jagan's Money to Its Accountsఅక్రమాస్తుల కేసులో తానూ నిర్దోషినంటూ ఓ పక్కన వైసీపీ అధినేత జగన్ ప్రచారం చేసుకుంటుండగానే, మరో పక్కన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, జగన్ ఆస్తులను అటాచ్ చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే కొన్ని వందల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకోగా, తాజాగా మరో 170 కోట్ల విలువైన మొత్తాన్ని బదిలీ చేసుకుని జగన్ కు షాక్ ఇచ్చింది.

భారతి సిమెంట్స్ అటాచ్ మెంట్ సంబంధించిన 749 కోట్ల స్థిర, చరాస్తులలో అటాచ్ మెంట్ లో, ఈడీ వాదనతో ఎజ్యుడికేటింగ్ అథారిటీ ఏకీభవించడంతో 170 కోట్ల విలువైన ఎఫ్ డీలు, షేర్లను తమ ఖాతాలోకి బదిలీ చేసుకుంది. ఎలాంటి అక్రమాలు జరగని పక్షంలో ఈ ఆస్తుల మొత్తం ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడికి పోతున్నాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories