ఏపీలోని లిక్కర్ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ తన దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే నేడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23 న విచారణకు హాజరుకావాలని ఈడీ తన నోటీసులో పేర్కొనింది.
అయితే మిథున్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో అరెస్టయ్యి కొన్నాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిలు మీద బయటకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా మిథున్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేయడంతో వైసీపీ లిక్కర్ మత్తు త్వరలో వదలబోతుందా అన్న చర్చ నడుస్తుంది.
ఇప్పటికే ఈ కేసులో అనేకమంది జగన్ సన్నిహితులు, వైసీపీ సానుభూతిపరులు, వైసీపీ నేతలు అరెస్టయ్యి జైళ్లల్లో మగ్గుతున్నారు. కసిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు పలువురు అరెస్టయ్యి జైళ్లల్లో బైలు కోసం ఎదుచూస్తున్నారు.
ఇక తాజాగా వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి సైతం ఈ నెల 22 న లిక్కర్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నుండి నోటీసులు అందుకున్నారు. ఒక్క రోజు గ్యాప్ లోనే ఇలా ఈ ఇద్దరు వైసీపీ కీలక నేతలు కేసులో విచారణకు హాజరుకావడం పట్ల ఏంజరగబోతుంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే గత వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం అంటూ – లిక్కర్ షాపులు నడిపింది, మధ్యనిషేధం అంటూ – లిక్కర్ రేట్లు పెంచింది, అలాగే నోటు కొట్టు బాటిల్ పట్టు అన్నట్టుగా లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని కాష్ రూపంలో మార్చింది. ఇలా వైసీపీ మద్యం ను ఒక ఆదాయవనరుగా, అవినీతి మయంగా మార్చేసింది.
మరి ఆ అవినీతి గుట్టు రట్టు చేసి వైసీపీ కి పట్టిన మద్యం మత్తు ఈడీ వదిలిస్తుందా.? తెరముందు కొచ్చిన చిన్న బాస్ లనే కాదు తెర వెనుకున్న పెద్ద బాస్ ని కూడా ఈడీ టచ్ చెయ్యగలుగుతుందా అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.






