జగన్ అరెస్ట్ కోసం సీబీఐ – ఈడీల మధ్య పోటీ?

ys jagan arrestప్రతి శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరు కావాల్సిన వైసీపీ అధినేత జగన్ 26వ తేదీన కూడా కోర్టు ముందుకొచ్చారు. ‘మనీలాండరింగ్’ చట్టాలకు వ్యతిరేకంగానే జరిగాయని ఈడీ వాదనను అంగీకరించని సీబీఐ కోర్టు, “మనీలాండరింగ్ కేసులను ఇప్పటికిప్పుడే ఆర్థిక నేరాల కోర్టుకు బదిలీ చేయలేమని, అన్నింటినీ కలిపి ఒకేసారి బదిలీ చేస్తామని” సీబీఐ స్పష్టం చేసింది. ఈడీ వాదనలకు వ్యతిరేకంగా జగన్ తరపు లాయర్ వినిపించిన వాదనలకు సీబీఐ కోర్టు అంగీకరించింది.

ADVERTISEMENT

“ఇప్పటికే కేసు ఒకటే అయినా, వివిధ వ్యక్తులు, సంస్థల పేర్లు చెప్పి సీబీఐ 11 చార్జిషీట్లు దాఖలు చేసిందని, తాజాగా ఈడీ కూడా విడతలవారీగా చార్జిషీట్లు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని” జగన్ తరపు న్యాయవాది వాదనతో సీబీఐ కోర్టు ఏకీభవించింది. జగన్ తరపు న్యాయవాది వాదలనతో సీబీఐ కోర్టు అంగీకరించడంతో సంతోషంగా ఉన్న వైసీపీ వర్గీయులకు తాజాగా హల్చల్ చేస్తున్న వార్త ముచ్చెమటలు పట్టిస్తోంది.

ఓ పక్కన జగన్ చేసిన ఢిల్లీ పర్యటన సానుకూల ఫలితాలను ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా, మరో పక్కన జగన్ అరెస్ట్ కోసం సీబీఐ, ఈడీల మధ్య పోటీ జరుగుతోందన్న ప్రచారానికి సోషల్ మీడియాతో పాటు నెటిజన్లు తెరలేపారు. మార్చి 28వ తేదీన ‘ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్’ ఎదుట హాజరు కావాల్సి ఉండడంతో అర్జెంట్ గా జగన్ ఢిల్లీ పర్యటన గావించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని వైసీపీ వర్గాలు సానుకూలంగా తీసుకుంటుంటే… ప్రత్యర్ధి వర్గాలు మాత్రం సీబీఐనే జగన్ ను అరెస్ట్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోందని, అందుకే ఈడీకి అనుమతి ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

ADVERTISEMENT
Latest Stories