Excel Sheet Should Be Opened For Cases on YSRCP Leaders

వైసీపీలో కనీసం డజను మంది పెద్ద నేతలపై కేసులు నమోదయ్యాయి. వీరుకాక వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నారు. వారందరిపై కేసు నమోదు మొదలు బెయిల్‌ పిటిషన్ల వరకు వివిద దశలలో కేసులు నడుస్తున్నాయి.

వైసీపీ నేతలపై కేసులు, నోటీసులు, విచారణాలు, ముందస్తు బెయిల్‌, అరెస్టులు, బెయిల్‌ పిటిషన్ల గురించి ఇప్పుడు ఒకటి రెండు పేరాలలో చెప్పాలంటే చాలా కష్టమే. కనుక వీటన్నిటి కోసం ఎక్స్‌ఎల్లో ఓ టేబిల్ తయారు చేసుకుంటే ఎవరిపై ఏ కేసు ఏ దశలో ఉందనే విషయం సులువుగా అర్దం అవుతుంది.

Also Read – బనకచర్ల: వైసీపీ కి పట్టదా.?

కానీ ఈ టేబిల్ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయకపోతే కొత్తగా కేసులు నమోదైనవారితో పాటు వారి అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందుతారు. ప్రస్తుతానికి లైవ్‌లో ఉన్న కేసులు:

· తాజాగా అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది.

Also Read – మెగా సినిమాలకు ఏమయ్యింది.?

· మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు రిమాండ్‌ జూన్ 19 వరకు పొడిగించబడింది.

· క్వార్జ్ గనుల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ సోమవారానికి వాయిదా పడింది.

Also Read – రాజాసింగ్: బీజేపీలో కలుపు మొక్కా.? తులసి మొక్కా.?

· తిరుమల ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నని, మాజీ జేఈవో గౌతమిని సిట్ అధికారులు రెండు రోజులుగా ప్రశ్నిస్తున్నారు.

· చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పనిచేసినప్పుడు సంస్థ నిధులు పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడినందుకు విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

· పెండింగ్ కేసులు: జగన్‌ అక్రమాస్తుల కేసులు , వివేకా హత్య కేసు, కాకినాడ దళిత యువకుడి హత్య కేసు, పేర్ని నాని గోదాములలో బియ్యం మాయం కేసు, కాకినాడ పోర్టు కబ్జా కేసు, పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి కేసు, టీడీపీ కార్యాలయాలపై దాడి కేసులు, (వల్లభనేని వంశీ) కిడ్నాప్ కేసు ఇంకా మరో వంద కేసులు వివిద దశలలో ఉన్నాయి.