
వైస్ జగన్ తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న తన తల్లి విజయలక్ష్మిని, చెల్లి షర్మిలను రాజకీయ వేదికల మీదకు తీసుకువచ్చి రాజకీయం రుచి చూపించారు.
Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్, జగన్‌లని టచ్ చేయగలరా?
అయితే షర్మిలకు ప్రత్యక్ష రాజకీయాలను పరిచయం చేసిన జగన్ రాజకీయాలలో పైకి ఎదగడానికి సొంతవారిని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వదిలించుకోవాలి అనేది కూడా పరిచయం చేసారు.
ముఖ్యమంత్రి పదవి కోసం తనను అడ్డుపెట్టుకున్న జగన్ ఆ పదవి పొందగానే తనకు చేసిన ద్రోహానికి అన్న మీద రాజకీయ యుద్ధం ప్రకటించి జగన్ పాలిట శికండిలా మారిపోయింది వైస్ షర్మిల.
Also Read – దానం: గోడ మీద పిల్లి మాదిరా.?
వైసీపీ ఓటమి, జగన్ పతనమే తన తక్షణ కర్తవ్యం కింద పని చేసిన షర్మిల అందుకు తగ్గట్టే తన రాజకీయ అడుగులు వేసింది. యుద్ధంలో తన గెలుపు కన్నా ప్రత్యర్థి ఓటమే ప్రధాన ఎజెండాగా వైసీపీ పై విమర్శలు చేసారు షర్మిల.
అయితే జగన్ పదవిలో ఉన్నప్పుడే ఆయనను టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు ఉపేక్షిస్తుంది అనుకోవడం వైసీపీ నేతల వెర్రితనమే అవుతుంది. వినుకొండలో జరిగిన వ్యక్తిగత హత్య ను రాజకీయ హత్యగా చిత్రీకరించి తన రాజకీయ మైలేజ్ పెంచుకోవడానికి ఢిల్లీలో నిరశన దీక్ష చేపట్టనున్నారు జగన్.
Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన సమయం ఆసనం ఏమయ్యింది అంటూ అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తున్న జగన్ కు తన ప్రశ్నలతో విరుచుకుపడ్డారు షర్మిల.
ప్రతిపక్షంలోకి రాగానే ఢిల్లీ వెళ్లి నిరసన తెలపడానికి సిద్దమైన జగన్ మరి అధికారంలో ఉన్న ఐదేళ్లలో వివేకా హత్య మీద న్యాయం కావాలి అంటూ ఎందుకు ధర్నా చెయ్యలేదు? సొంత బాబాయిని చంపిన వ్యక్తిని వెంటేసుకుని జగన్ చేస్తుంది హత్య రాజకీయం కాదా?
జగన్ మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు చేసారు, గొడ్డలి రాజకీయాలను ప్రోత్సహించారు, సొంత చెల్లల్ల మీద వ్యక్తిగత దాడులు చేసారు, అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేకపోయారు? పోలవరం నిధుల కోసం ఎందుకు ప్రశ్నించలేకపోయారు అంటూ జగన్ ను తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసారు షర్మిల.
అప్పుడు ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి సాకులు వెతుక్కున్నారు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం చెయ్యలేక ధర్నాల పేరుతో సాకులు వెతుక్కుంటున్నారు అంటూ పులివెందుల పులిగా చెప్పుకునే జగన్ అభద్రతను, భయాన్ని ప్రజల ముందు ఉంచారు షర్మిల.
దీనితో అన్నకు సాకులే అస్త్రాలైతే చెల్లికి ప్రశ్నలే ఆయుధాలయాయ్యి అన్నట్టుగా ఈ ఇద్దరి అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయ పోరు రోజుకో ఘట్టాన్ని చేరుకుంటున్నాయి. షర్మిల ప్రశ్నలకు ధీటైన సమాధానం చెప్పే సాహసం జగన్ ఎప్పటికి చెయ్యలేరు. ఒకవేళ చేసిన అది జగన్ కు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎదురుదెబ్బే అవుతుంది.
తానూ రాజకీయ అవకాశం ఇచ్చిన వ్యక్తి తనపైనే తిరగబడితే ఎలా ఉంటుందో జగన్ కు ఇప్పుడు తెలిసి వస్తుందేమో. తన కుటుంబానికి రాజకీయంగా జీవితాన్ని, పదవులను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి జగన్ చేసిన ద్రోహానికి షర్మిల్ రూపంలో కాంగ్రెస్ పార్టీ బదులు తీర్చుకుంటుంది.
అయితే కోర్టుల నుంచి అసెంబ్లీ నుంచి ఎదో ఒకసాకుతో సులువుగా తప్పించుకుంటున్న జగన్ తన చెల్లి షర్మిల దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు, ఎప్పటికి తప్పించుకోలేరు అనేది కూడా స్పష్టమయిపోయింది. .