వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ చుట్టూ ఎప్పుడు ఎదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. గతంలో రాజధాని ప్రాంతంలో పంటలు తగలబెట్టిన ఘటన నుంచి మొదలైన ఈ వివాదాలు నానాటికి ముదిరిపోతున్నాయి.
అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయంలో కూడా ఈ వైసీపీ నేత పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి, ఇంకా అనేక మంది మీద దాడికి పాల్పడ్డ ఆధారాలు దొరికాయి.
అయితే ఇన్ని వివాదాల నడుమ ఇప్పుడు తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు నందిగం సురేష్. సురేష్ మేనల్లుడు జగదీశ్ తనకు సురేష్ దంపతుల నుండి ప్రాణ హాని ఉందని, తన కుటుంబం ప్రమాదంలో ఉందంటూ ఒక బహిరంగ లేఖ విడుదల చేసారు.
2019 ఎన్నికల సమయంలో నందిగం సురేష్ కి తానూ ఇచ్చిన డబ్బు తిరిగి అడిగినందుకు సురేష్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ఆయన అనుచరులు తన కుటుంబాన్ని కార్లతో వెంబడిస్తున్నారంటూ ఒక సెల్ఫీ వీడియో ని కూడా విడుదల చేసారు జగదీశ్.
గతంలో కూడా సురేష్ ఇదే మాదిరి తుళ్లూరు లోని ఒక మహిళలను బెదిరించిన కేసులో, టీడీపీ కార్యకర్త మీద దాడికి పాల్పడ్డ కేసులో అరెస్టయ్యి జైలుకెళ్లారు.
ఇక ఇప్పుడు ఇలా సురేష్ సొంత మేనల్లుడి మీద బెదిరింపు పాల్పడుతుననట్టు ఆరోపణలు ఎదుర్కుంటూ మరోసారి మీడియా వార్తలలో నిలిచారు. మరి ఇన్ని ఆరోపణలు ఎదుర్కుంటున్న నందిగం సురేష్ పై వైసీపీ ఇప్పటికైనా చర్యలకు పాల్పడుతుందా.?
ప్రత్యర్థి పార్టీ నేతల మీద చిన్న ఆరోపణ వచ్చినా, ఆ ఆరోపణ పై ఆయా పార్టీల అధినేతలు చర్యలు తీసుకున్నా వైసీపీ మాత్రం ఇదేనా మీ పార్టీ సిద్ధాంతం.? ఇటువంటి వారితోనా మీ పార్టీ రాజకీయం అంటూ మీడియా ముందుకొచ్చి సుద్దపూసకబుర్లు చెపుతుంది.
మరి సొంత పార్టీలో ఏర్పడే వ్యవహారాలను చక్కబెట్టుకోలేని వైసీపీ ఎదుటివారికి మాత్రం నీతులు చెప్పడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. దీనితో వైసీపీ నేతలు ముందు సొంత పార్టీ నేతల పంచాయితీ మీద కాస్త ద్రుష్టి పెడితే మంచిదనే భావన సర్వత్రా వినిపిస్తుంది.
మరి పార్టీ అధినేతగా జగన్ ఆ దిశగా ఇప్పటికైనా అడుగులు వేస్తారా.? లేక ఈ రప్ప రప్ప రాజకీయాల మీదే ఆధారపడి పార్టీని ముందుకు తీసుకెళ్తారా.? ఇటువంటి నేతలను మంచివారు, అందగాళ్ళు, సౌమ్యులు అంటూ కీర్తిస్తూ ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు పంపుతారా.?






