హైదరబాద్ మునిసిపల్ పరిధిలోని పోలింగ్ ముగిసింది. కేవలం 45 శాతమే పోలయ్యిందని నగర కమీషనర్ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేసారు. దీంతో ఈ 45 శాతంలో ఎవరి వాటా ఎంత అని లెక్క కట్టే పనిలో ప్రముఖ సర్వేలు వెలువడుతున్నాయి. మొదటగా టీవీ9 న్యూస్ ఛానల్ తమ సర్వేను ప్రజల ముందుంచింది.
గ్రేటర్ పరిధిలో ఉన్న మొత్తం 150 స్థానాలకు గానూ అధికార టీఆర్ఎస్ పార్టీకి 78-82, ఎంఐఎంకు 35-40, టిడిపి + బిజెపికి 28-33, కాంగ్రెస్ కు 8-10, ఇతరులు 1-3 స్థానాలు కైవసం చేసుకుంటారని అంచనా వేసింది. దీంతో హైదరాబాద్ మేయర్ పీఠంపై ‘గులాభీ’ జెండా ఎగరబోతుందని టీఆర్ఎస్ వర్గాలు పండగ చేసుకుంటున్నారు. ఇలా రకరకాల సర్వేలు వెలువడుతున్నప్పటికీ అగ్రస్థానం మాత్రం టీఆర్ఎస్ కే దక్కుతోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



