సంక్షోభంలో అన్ని పెరుగుతాయి..ఒక్క ఆదాయం తప్ప

Global Crises Trigger Price Rise, Middle Class Hit

ప్రపంచం మొత్తంలో ఏ మారుమూల ఒక్క సంక్షోభం వచ్చినా దాని ఫలితం మొత్తం ప్రపంచం అనుభవించాల్సిందే అనేదానికి మొన్న కరోనా నిన్న ట్రంప్ టారిఫ్లు నేడు ఇరాన్ యుద్ధం సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

అయితే ఇక్కడ సంక్షోభం ఏరూపంలో వచ్చినా కరోనా వైరస్ అయినా ట్రంప్ టారిఫ్ లైన లేదా యుద్ధ భయాలైన కానీ పేదవాడి నుంచి సామాన్య మధ్యతరగతి వాడి వరకు ధరల పెరుగుదలతో అందరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.

ADVERTISEMENT

అలాగే వాటి ఫలితాలతో తాగే పాల నుంచి వేసుకునే మెడిసిన్, పీల్చే గాలి వరకు, అలాగే పెళ్లిళ్లకు, శుభకార్యాలకు సంప్రదాయాలుగా భావించే వెండి, బంగారం నుంచి పూలు, పండ్ల వరకు అన్నింటి ధరలకు రెక్కలొచ్చేస్తాయి. కరోనా వైరస్ ప్రపంచం మొత్తానికి చావు భయాన్ని పరిచయం చేసి అందరిని, అన్ని వ్యవస్థలను కొన్నాళ్లపాటు నాలుగు గోడల మధ్య నిర్బంధించింది.

ఆ సమయంలో ఆక్సిజన్ కొరతతో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కరోనా మహమ్మరి వైద్య సేవలను అత్యంత కాస్టలీగా మార్చేసింది. ఆ సమయంలో వండుకునే పప్పు దినుసుల నుంచి వంట నూనె, కూరగాయలు ఇలా ప్రతి వస్తువు ధరలు ఆకాశాన్ని తాకాయి, కానీ అదే సమయంలో సామాన్యుడి ఆదాయం మాత్రం అక్కడే స్థిరంగా, నిలకడగా ఏ మార్పు లేకుండా ఉండిపోయింది.

అలాగే అగ్రరాజ్య అధ్యక్షుడిగా ట్రంప్ తెచ్చిన టారిఫ్లు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి, ఈ సంక్షోభంతో కూడా అనేక వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి, కానీ ఆదాయం మాత్రం అంతకంతకు దిగజారుతోంది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం పట్టే దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు నేలచూపులు చూస్తున్నాయి.

ఇక ఇరాన్ యుద్ధం ఏకంగా ప్రతి సామాన్య ప్రజానీకం వంట గదిని తాకింది. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరుల ధరలకు రెక్కలొస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ భారాన్ని ప్రభుత్వాలు ఇంకా సామాన్య ప్రజానీకం నెత్తిన వేయకపోయినా రానున్న రోజులలో వాటి భారం ప్రతి సామాన్యుడు మోయకతప్పని పరిస్థితి.

AI టెక్నాలజీ లాంచింగ్ తో అనేక ఐటీ పరిశ్రమలకు మాన్ పవర్ అవసరం పరిమితం అవుతుంది. దీనితో అనేకమంది ఐటీ ఉద్యోగులు లే ఆఫ్ ల రూపంలో నిరుద్యోగులుగా మారుతున్నారు. డాలర్ తో రూపాయి పతనం దేశంలో ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ఇది కూడా దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఒక కారణంగా మారుతుంది.

ఇలా ఎక్కడ ఏ సంక్షోభం ఏర్పడిన దాని తాలూకా పెరుగుదల ఒక్క సామాన్యుడి ఆదాయం విషయంలో తప్ప మిగిలిన

అన్ని వస్తువుల ధరల మీద కనిపిస్తుంది అనేది స్పష్టమవుతుంది. మరి ఆ సామాన్యుడి ఆదాయం కూడా పెరిగేలా ఏదైనా ఒక సంక్షోభం ఉంటుందా.? దీనితో ఈ రోజులలో సామాన్యుడి జీతాలు ఉన్నంత స్థిరంగా ఒక వ్యక్తి దైనందిక జీవితం ఉంటుందా అన్న చర్చ నడుస్తుంది..!

ADVERTISEMENT
Latest Stories