
సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని వైసీపీ అధినేత జగన్ ఒప్పుకోకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో నేతలు చెప్పుకుంటున్నారు.
ఇదే వేగంతో అభివృద్ధి సాగితే వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు, ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్‌కు ప్రజలు క్యూకడతారు.
Also Read – యుద్ధాలతో కనపడే విధ్వంసం కొంత.. కనపడనిది అనంతం!
ఇప్పుడు ఇలా చెప్పుకోవడం చాలా అతిశయోక్తిగా అనిపించినా 2029 నాటికి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయికి చేరుకోవడం ఖాయం. ఇందుకు బలమైన కారణాలు చాలానే కనపడుతున్నాయి.
ఐటి కంపెనీలను ప్రోత్సహించే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి మంచి పేరుంది. పైగా ఎప్పటికప్పుడు అందివచ్చే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటుంటారు.
Also Read – బిఆర్ఎస్ కారు స్టీరింగ్ బీజేపీ చేతిలో ఉందా.?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య బలమైన బంధం ఏర్పడినందున రాష్ట్రాభివృధ్దికి కేంద్రం అన్ని విదాల సహకరిస్తుండటం కూడా ఓ బలమైన కారణమే.
మరోపక్క వైసీపీ అధినేత జగన్ మద్యం కుంభకోణం కేసులో ఏ క్షణంలోనైనా జైలుకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. ఆయనకు తోడూ నీడగా ఉండే కేసీఆర్ పరిస్థితి కూడా నానాటికీ దయనీయంగా మారుతోంది. కనుక బీజేపిలో విలీనం అయిపోయేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన కూతురు కల్వకుంట్ల కవిత స్వయంగా బయటపెట్టారు.
Also Read – రాష్ట్ర ప్రయోజనాల కోసం క్రెడిట్ త్యాగం.. అవసరమే
ఓ పక్క కూటమి బలపడుతుండగా, దాని శత్రువులు బలహీనపడుతున్నారు కనుక ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు క్యూకడుతున్నాయి.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ రాజధాని ఏది? అని అందరూ గుగూల్లో వెతికేవారు. కానీ ఇప్పుడు అమరావతిలోనే గూగుల్కంపెనీ ఏర్పాటు కాబోతోంది!
అమరావతిలో తమ కంపెనీ ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. దానికి అనంతవరం-నెక్కల్లు మద్య ఈ-8 రోడ్డు పక్కన సుమారు 143 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేయడంతో గూగుల్ ప్రతినిధులు వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించారు.
ఆ ప్రాంతానికి సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబోతున్నట్లు ప్రభుత్వం తెలియజేయడంతో వారు అక్కడ తమ కంపెనీ ఏర్పాటుకి సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సిఎం చంద్రబాబు నాయుడుతో గూగుల్ ప్రతినిధులు సమావేశమై చర్చించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.
అమరావతికి గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీ వస్తోందంటేనే రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలకు చాలా సానుకూల వాతావరణం ఉన్నట్లు సంకేతంగా భావించవచ్చు. ఇక గూగుల్ అమరావతికి వస్తే దాని వెనుకే అనేక చిన్న పెద్ద జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు క్యూకట్టడం ఖాయం.
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇమేజ్ చూసి విశాఖ సదస్సులో రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని మాజీ గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ బొంకారు. కానీ ఇమేజ్ అంటే ఇదీ కదా?