విశాఖలో గూగుల్… నేడే శంకుస్థాపన

Google data center foundation ceremony in Visakhapatnam Andhra Pradesh

యావత్ ప్రపంచాన్ని అనుసంధానిస్తున్న ‘గూగుల్’ ఏపీకి వస్తోంది. సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే స్టేషన్‌, ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కలిసి విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కి భూమిపూజ చేస్తారు. దీని కోసం నిన్న సాయంత్రమే కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విశాఖ చేరుకోగా మంత్రి నారా లోకేష్‌ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు.

గూగుల్ టెక్ కంపెనీ రూ.1.35 లక్షల కోట్లు పెట్టుబడితో 1 గిగావాట్ సామర్ధ్యంతో ఆసియాలో కెల్లా అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. ఇలాంటి అంతర్జాతీయ కంపెనీ, ఇంత భారీ పెట్టుబడి కోసం దేశంలో ఇతర రాష్ట్రాలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే సిఎం చంద్రబాబు నాయుడు దీనిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సాధించారు.

ADVERTISEMENT

గూగుల్ డేటా సెంటర్ ఒకే చోట కాకుండా అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 200 ఎకరాలు, విశాఖ జిల్లా, భీమిలి నియోజకవర్గంలో తర్లువాడలో 200 ఎకరాలు, విశాఖ జిల్లాలోనే సింహాచలం పుణ్యక్షేత్రం సమీపంలో అడవివరంలో మరో 200 ఎకరాలలో వేర్వేరుగా మూడు గూగుల్ డేటా సెంటర్స్ ఏర్పాటు కాబోతున్నాయి. వీటి నిర్మాణపనులు 2028లోగా పూర్తి కార్యకలాపాలు మొదలుపెట్టాలని గూగుల్ టెక్ లక్ష్యంగా పెట్టుకుంది.

దీని కోర్ డేటా సెంటర్‌లో అత్యంత నైపుణ్యం కలిగిన 1500-2000 మంది సాంకేతిక నిపుణులకి, మరో 23,000 సాఫ్ట్‌వేర్‌, మెయింటేనెన్స్, ఎలక్ట్రిక్ తదితర ఇంజనీర్లు, అకౌంటింగ్, హెచ్ఆర్, ట్రాన్స్‌పోర్ట్, హౌస్ కీపింగ్ తదితర విభాగాలలో మరో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇవి కాక మరో 43,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

గూగుల్ వస్తే దాంతో బాటు అనేక జాతీయ, అంతర్జాతీయ అనుబంద పరిశ్రమలు, ఐటి కంపెనీలు కూడా విశాఖకు తరలివస్తాయి. కనుక అవన్నీ కూడా వస్తే వాటితో భారీగా ఉద్యోగాలు, ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తుంది. గూగుల్ వంటి కంపెనీ వస్తే చుట్టుపక్కల రియల్ ఎస్టేట్, రవాణా, హోటల్స్‌, వినోద రంగాలు అభివృద్ధి చెందుతాయి. కనుక ఈ ఒక్క గూగుల్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ చిత్రమే మారిపోనుంది.

ADVERTISEMENT
Latest Stories