జీఎస్టీ: ముందు నుయ్యి.. వెనుక గొయ్యే

GST Cut Before Dasara: Who Gains, Who Loses?

దసరా పండగ ముందు జీఎస్టీ తగ్గించడం చాలా గొప్ప నిర్ణయమని కేంద్ర ప్రభుత్వం గట్టిగా చెప్పుకుంటోంది. ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు కూడా దానికి పక్క వాయిద్యాలు వాయిస్తున్నాయి.

అయితే జీఎస్టీ తగ్గింపుతో తెలంగాణ ప్రభుత్వానికి సుమారు సుమారు రూ.7,000 కోట్లు ఆదాయం తగ్గిపోయిందని, దానిని కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాలని సిఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి దీనికి మరో కోణం చూపుతోంది.

ADVERTISEMENT

కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కాస్త అటూ ఇటూగా అంతే జీఎస్టీ ఆదాయం కోల్పోతుంది. కానీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నందున అప్పుడే ఆ బాధని బయటపెట్టుకోలేదు! కనుక ముందుగా శాసనసభ, మండలిలో జీఎస్టీ సంస్కరణలని అభినందిస్తూ ఓ తీర్మానం ఆమోదించి అందరూ బల్లలు చరిచారు!

జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర సరుకులు, సామాన్య మద్య తరగతి ప్రజలు వినియోగించే అనేక వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి కనుక వారికి సంతోషమే. కనుక భారీగా కొనుగోళ్ళు చేస్తే ఆ మేరకు పెరిగే ఆదాయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు లోటు భర్తీ అవుతుందని కేంద్రం ఉవాచ.

కానీ రాష్ట్రాలకు ఏర్పడే ఈ లోటు ఆవిధంగా భర్తీ కాదు కనుకనే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నష్టాన్ని పూరించాలని డిమాండ్ చేశారనుకోవచ్చు. కానీ కేంద్రానికి కూడా భారీగా ఆదాయం తగ్గుతుంది కనుక అది కూడా ఈ లోటుని భర్తీ చేయ(లే)దు.

అప్పుడు జీఎస్టీ తగ్గింపుతో లబ్దిపొందుతున్న ప్రజల వద్ద నుంచే వసూలు చేసుకొని ఈ లోటుని భర్తీ చేసుకోవలసి రావచ్చు. జీఎస్టీ సంస్కరణలను అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభలో ఇప్పుడు బల్లలు చరిచినా, ప్రజలకు నొప్పి తెలియకుండా ఈ లోటుని ఎలా భర్తీ చేసుకోవాలనే ఆలోచన మొదలుపెట్టే ఉంటాయి. కనుక ఈ మద్దెల దరువు ఎప్పుడు ఏవిదంగా మొదలవుతుందో రాబోయే రోజుల్లో మెల్లగా తెలుస్తుంది. అప్పుడు గానీ జీఎస్టీ తగ్గింపు అనేది ఓ మిధ్య అని అందరికీ భోధపడుతుంది.

ADVERTISEMENT
Latest Stories