అడిగి తన్నించుకోవడం అంటే ఇదేనా?

Gudivada Amarnath Davos controversy reaction

మన రాజకీయాలలో మేమున్నామంటూ అప్పుడప్పుడు గుర్తుచేసేవాళ్ళు కొందరున్నారు. వారిలో లక్ష్మీ పార్వతి, వైఎస్ షర్మిల, కోడి-గుడ్డు మంత్రిగా ప్రసిద్ధి చెందిన గుడివాడ అమర్నాథ్ వంటివారున్నారు.

ఇటీవలే ఎన్టీఆర్ వర్ధంతి రోజున లక్ష్మీ పార్వతి తన కోటా పూర్తిచేసేశారు. వైఎస్ షర్మిల కూడా చంద్రబాబు నాయుడు పాలన బాగోలేదంటూ ‘నెలవారీ కోటా’ పూర్తి చేసేశారు.

ADVERTISEMENT

అత్యంత కీలకమైన పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రిగా ఉన్నప్పుడు వాటి గురించి పెద్దగా మాట్లాడని గుడివాడ అమర్నాథ్, ఇప్పుడు ఆ శాఖకి సంబందించిన అన్ని విషయాలపై మాట్లాడాల్సిన బాధ్యత తనపై ఉందనుకొని మాట్లాడుతుండటం కాస్త విచిత్రంగానే ఉంటుంది.

ప్రస్తుతం సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ బృందం దావోస్ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడుల కోసం చేస్తున్న కృషి చేస్తున్నారు.

కనుక మాజీ మంత్రిగా దావోస్ సదస్సు, పెట్టుబడులు, వైసీపీ క్రెడిట్ గురించి మాట్లాడటం తన బాధ్యత అనుకున్నారు గుడివాడ అమర్నాథ్. కనుక ఏదో మాట్లాడేశారు. కానీ అదేం విచిత్రమో వైసీపీ విషయంలో దేవుడి స్క్రిప్ట్ ఎప్పుడూ వేరేగానే ఉంటోంది.

ఆయన క్రెడిట్ గురించి మాట్లాడితే వెంటనే కోడికత్తి, గొడ్డలి, తల్లీ చెల్లిని మెడ పట్టుకొని బయటకు గెంటేయడం వగైరాలు మీ క్రెడిట్స్ కదా? అంటూ మంత్రి నారా లోకేష్‌తో సహా టీడీపీ నేతలు చురకలు వేశారు.

సరే! దావోస్ సదస్సు గురించి ఏదో మాట్లాడబోయి మంత్రి నారా లోకేష్‌కు సవాలు విసిరారు. “ఈ సమయంలో అక్కడ మైనస్ 5-10 డిగ్రీలు ఉష్ణోగ్రత, శరీరం గడ్డ కట్టుకుపోయే అంత చలి ఉంటుంది. కనుక సదస్సుకి వెళ్ళడం మంచిది కాదు,” అని నేను అన్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు మన వెరీ గుడ్డు మంత్రిగారు.

టీడీపిని కెలికితే ఎవరూరుకుంటారు? వెంటనే దావోస్ సదస్సు గురించి ఆనాడు అయన మాట్లాడిన మాటలు, వీడియోతో సహా సోషల్ మీడియాలో పెట్టి “మరి రాజకీయాల నుంచి తప్పుకుంటారా గుడ్డు మంత్రిగారు?” అంటూ ఒకటే పీకారు.

పైగా కోడి- గుడ్డు, దావోస్ చలి వంటి తీపి జ్ఞాపకాలు గుర్తుచేసినందుకు చాలా థాంక్స్ కూడా చెపుతున్నారు. అడిగి తన్నించి కోవడం అంటే ఇదేనా?

ADVERTISEMENT
Latest Stories