గత ఎన్నికలలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపి, ఈసారి ఎన్నికలలో చాలా దారుణంగా ఓడిపోయింది. రోజా చెప్పిన్నట్లు రాష్ట్రంలో ఏ పిల్లాడిని అడిగినా ఏదో ఓ కారణం చెప్పగలడు. కనుక జగన్మోహన్ రెడ్డికి, వైసీపి నేతలకు అవి తెలియవని అనుకోలేము.
కానీ జగన్ “ఈవీఎంల వల్లనే మనం సాంకేతికంగా మాత్రమే ఓడిపోము. కానీ 40% ప్రజలు మనకే ఓట్లు వేశారు కనుక ఓడిపోయామని ఎవరూ అనుకోవద్దు… కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి,” అంటూ వైసీపి నేతల కళ్ళకు మళ్ళీ గంతలు కట్టేస్తున్నారు.
వైసీపి అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఇలాగే తమని 175/175 అంటూ తమకు గంతలు కడుతున్నారని వైసీపి నేతలు గ్రహించినా, అప్పుడు ఎవరూ సాహసించలేక, ఆయన చూపిన దారిలోనే గుడ్డిగా నడుస్తూ అందరూ గోతిలో పడిపోయారు.
కనుక ఇప్పుడైనా ధైర్యంగా ‘ఈవీఎంల వల్ల కాదు… మీ అహంకారం, మీ అనాలోచిత నిర్ణయాలు, మీ విధానాల వలననే మేము ఓడిపోయామని’ ఎవరైనా ధైర్యంగా చెపుతారేమోనని జనాలు చూస్తుంటే, వైసీపి నేతలందరూ మళ్ళీ వినయంగా చేతులు కట్టుకొని ఆయన ఎదుట నిలబడి, ‘శకుని… పాచికలు…’ అంటూ ఆయన చెప్పే పురాణగాధలు బుద్ధిగా వింటున్నారు.
అయినా క్రైస్తవ మతాన్ని పాటించే జగన్మోహన్ రెడ్డికి హిందూ పురాణాల మీద ఇంత ‘అబ్‌సెషన్’ లేదా ‘పాషాన్’ ఏమిటో అర్దం కాదు!
అసలు విషయానికి వస్తే గురజాల మాజీ వైసీపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాత్రం మెల్లిగా ఓపెన్ అయిపోయారు. ఈరోజు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేశారు. దానిలో వైసీపి ఓటమికి ఒకటీ రెండూ కాదు… అనేక కారణాలు గడగడా చెప్పేశారు. ఆయన జాబితా ప్రకారం…
1. నాసి రకం మద్యం సరఫరా. రాష్ట్రంలో రోజువారీ కూలి పనులు చేసుకునేవారు, నిరుపేదలు సుమారు 25-30% మంది ఈ నాసిరకం మద్యం తాగే వైసీపికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మేము సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి
రెడ్డి ఇద్దరికీ చాలాసార్లు దీని గురించి హెచ్చరించాము కానీ వాళ్ళు పట్టించుకోలేదు. అందుకే ఓడిపోయాము.
2. మా ప్రభుత్వం ఇసుక విధానం సరిగా లేకపోవడం వలన రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళ ఊసురే మాకు తగిలింది.
3. మా నేతల బూతులు, నోటి దురుసుతనం. అధికారంలో వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టేసి మద్యలో ఎక్కడా ఆపకుండా చివరి వరకు కంటిన్యూ చేసేసి, చంద్రబాబు నాయుడుతో సహా ప్రతిపక్ష నేతలందరినీ అవహేళన
చేశారు. చాలా దారుణంగా అవమానించారు.
4. చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టి మరోసారి అవమానించారు. ఈ అవమానాల నుంచే టిడిపి నేతల్లో ఎలాగైనా ఎన్నికలలో గెలవాలనే కసి పెరిగింది. ఆ కసితోనే పనిచేసి ఎన్నికలలో తమ కూటమిని గెలిపించుకున్నారు.
5. ఆనాడు కౌరవులు పాండవులను అవమానిస్తే వారు కసితో యుద్ధం చేసి కౌరవులను ఓడించారు. ఆనాడు సీతాదేవిని అపహరించి రావణుడు శ్రీరాముడుని అవమానిస్తే ఆయన సముద్రం దాటివెళ్ళి రావణుడిని హతమార్చారు.
అలాగే చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలను మావాళ్లు అవమానించినందుకు వారు కూడా కసితో పోరాడి మమ్మల్ని ఓడించి ఇక్కడ కూర్చోబెట్టారు.
Finally Some Sane Analysis By A YSRCP Leader
చంద్రబాబు గారిని బూతులు తిట్టడం, ఆయనను జైలు లో పెట్టడం ఓటమి కి కారణం
– గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి#YSRCongress pic.twitter.com/vxAKvMHzQ7
— M9 NEWS (@M9News_) June 23, 2024




