బర్త్ డే సెలబ్రేషన్స్ అంటే ఎలా ఉండాలి? మాంచి ఉత్సాహంతో, ఉత్తేజంతో తీన్ మార్ స్టెప్పులు వేస్తూ అదిరిపోవాలి కదా..! సరిగ్గా విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు కానుకగా విడుదలైన “గురు” సినిమా టీజర్ అలానే ఉందని చెప్పాలి. వెంకీ 56వ జన్మదినం సందర్భంగా విడుదలైన టీజర్ లో తన వయసును మరిచిపోయి మరీ వెంకీ మాంచి జోష్ ఫుల్ గా కనిపించారు. వెంకీ అభిమానులు పుట్టినరోజును ఎలా జరుపుకుంటున్నారో, ఈ టీజర్ కూడా అలానే ఉందని చెప్పాలి.
పెంచిన గడ్డం లుక్ లో ఇప్పటికే విక్టరీ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా విడుదల చేసిన వీడియోలో కూడా అదే లుక్ తో కట్టిపడేసాడు. ముఖ్యంగా ఈ వయసులోనూ కండలు తిరిగే బాడీతో అభిమానుల చేత కేకలు పెట్టించే విధంగా ఉన్నాడు వెంకీ. కొంగర సుధా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్, రితికా సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. అన్ని హంగులను పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read – జమిలి బిల్లు సరే… ఆచరణ సాధ్యమేనా?