Ashta Digbandhanam KCR

రెండు దశాబ్ధాలపాటు తెలంగాణ రాజకీయాలను కేసీఆర్‌ శాశించినప్పుడు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఎందువల్ల ఓడిపోయారు? అనే దానిపై ఇప్పటికే చాలామంది పోస్టుమార్టం చేసి అనేక కారణాలు చెప్పారు.

ఈ రెండో ఓటమికి ముఖ్యంగా మూడు కారణాలు చెపుతున్నారు. 1. శాసనసభ ఎన్నికలలో ఓటమి తర్వాత కూడా కేసీఆర్‌ అహంభావం తగ్గకపోవడం. 2. ప్రత్యర్ధులుగా ఉన్న జాతీయ పార్టీలను తక్కువ అంచనా వేయడం. 3. కూతురు కల్వకుంట్ల కవితని విడిపించుకునేందుకు.

Also Read – విశాఖకు మెట్రో… భారం అవుతుందేమో?

ఈ మూడు కారణాలు చాలా సహేతుకంగానే కనబడుతున్నాయి. తెలంగాణలో తనకు తిరుగేలేదనుకున్నప్పుడు శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడం కేసీఆర్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. దానిని జీర్ణించుకుని, లోపాలు సరిదిద్దుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టడం చాలా అవసరం.

కానీ కేసీఆర్‌కు అంత సమయం లేకుండా వెంటనే లోక్‌సభ ఎన్నికలు ముంచుకు వచ్చేశాయి. కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని ‘ఆనాటి తెలంగాణ ఉద్యమాలనాటి పాత కేసీఆర్‌ని మళ్ళీ పరిచయం చేస్తానంటూ’ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు. ఇది ప్రజలకు తప్పుగా అనిపించడంతో ‘ఆ కేసీఆర్‌ని’ వద్దనుకుని ఉండవచ్చు.

Also Read – భయపడ్డారా.? భయపెడుతున్నారా.?

కేసీఆర్‌ తాను ఈ దేశంలో… ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలోనే గొప్ప మేధావినని గట్టిగా నమ్ముతుంటారు. అని పార్టీ నేతలను, కార్యకర్తలను కూడా నమ్మించగలిగారు. కానీ ప్రజలను నమ్మించలేకపోయారు!

లేకుంటే 10-12 ఎంపీ సీట్లు ఇస్తే చాలు… కేంద్రంలో చక్రం తిప్పుతానన్న కేసీఆర్‌ మాటలు నమ్మి ఇచ్చి ఉండేవారే కదా? కానీ నమ్మలేదు గనుకనే కేసీఆర్‌కి ఒక్క సీటు కూడా ఇవ్వలేదనుకోవచ్చు.

Also Read – చంద్రబాబు పాలనకు జీరో మార్కులట మరి…

అయితే తన తెలివితేటలకు తానే అబ్బురపడే కేసీఆర్‌, జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ రెండూ తన చేతిలో ఎదురు దెబ్బలు తిన్నాయి కనుక వాటిని చాలా తక్కువగా అంచనా వేశారు. తనలో ‘ఆ పాత కేసీఆర్‌’ ధాటికి తట్టుకోలేక రెండూ చేతులెత్తేస్తాయనుకుంటే అవి కేసీఆర్‌ కంటే గొప్ప వ్యూహాలు పన్నగలవని నిరూపించి చూపి చెరో 8 సీట్లు ఎగరేసుకు పోయాయి. కానీ నేటికీ కేసీఆర్‌ నమ్మడం లేదు. బహుశః బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయిన తర్వాత నమ్ముతారేమో?

కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ నేతలు ఇదివరకు ఎన్నికలంటే ఏదో గేమ్ అన్నట్లు అలవోకగా ఆడి ప్రతీ ఎన్నికలలో గెలిచేస్తుండేవారు. కనుక లోక్‌సభ ఎన్నికలలో కేసీఆర్‌ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం ఎవరికీ నమ్మశక్యంగా లేదు.

కనుక లిక్కర్ స్కామ్‌ కేసులో మూడున్నర నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కూతురు కల్వకుంట్ల కవితని విడిపించుకోవడానికే కేసీఆర్‌ తన ఎంపీ సీట్లను బీజేపీకి వదులుకుని, కూతురు కోసం బిఆర్ఎస్ పార్టీని బలి చేసుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ ఆమె త్వరలో జైలు నుంచి విడుదలైతే ఇది నిజమే అని భావించవచ్చు. కనుక కేసీఆర్‌ ఓడిపోయారా? ఓడించుకున్నారా? అంటే రెండోదే అనిపిస్తుంది.