‘కుమారి 21ఎఫ్’తో ఒక్కసారిగా యువత హృదయాలను కొల్లగొట్టిన హేబా పటేల్ ప్రస్తుతం మరికొన్ని యూత్ మెచ్చే చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఇవి సెట్స్ పైన ఉండగా, పనిలో పనిగా వరుణ్ తేజ్ సినిమాలో ఎంపికై మెగా క్యాంప్ లోకి కూడా అడుగు పెట్టింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మిస్టర్” సినిమాలో హీరోయిన్ గా హేబా పటేల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా అడుగు పెట్టిందో లేదో మరో మెగా హీరోను తన వెంటపడేలా చేసిందట ఈ ముద్దుగుమ్మ.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న సినిమాలో హీరోయిన్ గా హేబాను ఎంపిక చేసినట్లుగా సమాచారం. మొదటి సినిమా సెట్స్ పైన ఉండగానే మరో మెగా హీరోను ఆకర్షించిందంటే, ఈ ముద్దుగుమ్మ మెగా హీరోలందరి సరసన నటించేయడం ఖాయంగా కనపడుతోందని సినీ వర్గాలు అంటున్నాయి. ‘పారితోషికం తక్కువ – పబ్లిసిటీ ఎక్కువ’ అనే సిద్ధాంతమే హేబాను ఎంపికకు వెనుక గల కారణాలుగా తెలుస్తోంది.



