ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ తమ విధానాల్లో పోరాడుతున్న చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ లపై ఈగను కూడా వాలనివ్వబోనని నటుడు శివాజీ వెల్లడించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ నేతలకు ఏదైనా కీడు తలపెడితే ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.
ADVERTISEMENT
తాను మూడో కన్ను తెరవనున్నానని, ఈ సాయంత్రం ఓ కీలక ప్రకటన చేస్తానని, దాంతో బీజేపీ దిమ్మ తిరుగుతుందని అన్నారు. ప్రజలకు సంచలన విషయాలను వెల్లడించనున్నానని, తన ప్రకటనతో ప్రత్యేక హోదా సాధన సమితికి గానీ, పార్టీలకు గానీ, వ్యక్తులకు గానీ సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
ADVERTISEMENT



