తమిళ హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సూర్య తన తెలుగు డబ్బింగ్ సినిమాలతో ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. తన విలక్షణ నటనతో సౌత్ హీరోగా ఎదిగిన సూర్య ఎప్పుడు సమాజం పట్ల తనవంతు బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు.
ఎప్పుడు ఏ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా బాధితులకు, ప్రభుత్వానికి తన ఆపన్న హస్తాన్ని అందిస్తూనే ఉంటారు ఈ స్టార్ హీరో. అయితే ఈ మధ్య కాలంలో తమిళ నాట జరిగిన ఓ ప్రకృతి విపత్తు మిచౌన్గ్ తుఫాన్ లో ఎంతోమంది వరద బాధితులు నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో ప్రభుత్వానికి 10 లక్షల ఆర్థికసహాయాన్ని ప్రకటించిన సూర్య తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారు.
అయితే ఆ విప్పత్తులో వరదబాధితులకు అండగా ఉండాలంటూ, వారికీ అవసరమైన సహాయ కార్యక్రమాలలో పాలు పంచుకోవాలంటూ తన అభిమానులకు పిలుపునిచ్చారు సూర్య. తమ అభిమాన హీరో పిలుపుతో కదిలిన సూర్య ఫాన్స్ స్థానికంగా అవసరమైన వారికీ తమ చేయూతనందించారు.
ఈ నేపథ్యంలో తన మాట పైన, తన పై గౌరవంతో ముందుకొచ్చిన తన అభిమానులకు చెన్నై లో ఒక ఆత్మీయ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు సూర్య. దీనితో తమ సేవలను గుర్తించి తమ పై ఇంతటి అభిమానం కురిపిస్తున్న సూర్య పట్ల మరింత విధేయతగా ఉంటామని, సూర్య మంచి మనస్సు ఇది అంటూ ఆ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలను షేర్ చేస్తూ సూర్య అభిమానులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందంటూ కాలరెగరేసుకుంటాం అంటూ సూర్య పై తమకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు..




