చరిత్ర పునరావృతం కావడం అనే మాట తరచూ వింటూనే ఉంటాము. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. నాడు కేసీఆర్, జగన్ సంక్షేమ పధకాలు పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. అపుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, టీడీపిలు విమర్శిస్తుండేవి.
లక్షల కోట్లు అప్పులు చేస్తూ, ప్రభుత్వాస్తులను, చివరికి భవిష్యత్ రాబడులను కూడా తాకట్టుపెట్టి అప్పులు చేయడం అవసరమా? అని ప్రశ్నించేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్, టీడీపి (కూటమి ప్రభుత్వం) కూడా సంక్షేమ బాట పట్టాయి. కానీ కేసీఆర్, జగన్‌ని గెలిపించని ప్రజలు తమని తప్పకుండా గెలిపిస్తారని రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకి నమ్మకం ఉందా? లేనప్పుడు మితిమీరిన పధకాలు దేనికి? మళ్ళీ ఆ భారం ప్రజలపైనే వేసి వారి ఆగ్రహానికి గురయ్యి నష్టపోవడం దేనికి?
నాడు జగన్ హయంలో రాష్ట్రంలో రోడ్లన్నీ గోతులమయమంటూ టీడీపి, జనసెనలు పోటాపోటీగా ఫోట్లు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ నిలదీస్తుండేవి. ఇప్పుడు అదే పని వైసీపీ చేస్తోంది!
ఇదివరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పేదల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పధకాల క్రింద లక్షల ఇళ్ళు నిర్మించారు. వాటికి జగన్ ప్రభుత్వం వైసీపీ రంగులు వేసుకొని అవన్నీ తమ పద్దులో వ్రాసుకునే ప్రయత్నం చేసింది.
అప్పుడు టీడీపి నేతలు ఆ ఇళ్ళున్న కాలనీల వద్దకు మీడియాను వెంటబెట్టుకొని వెళ్ళి తమ హయంలో కట్టిన వాటిని చూపించి, ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేవారు.
మెడికల్ కాలేజీల విషయంలో అధికార, ప్రతిపక్షాల మద్య యుద్ధం మొదలవడంతో ఇప్పుడు వైసీపీ నేతలు మీడియాను వెంటబెట్టుకు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, మెడికల్ కాలేజీలు దాచేస్తే దాగేవి కావని తెలిసినా రెండు పార్టీలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండటం విస్మయం కలుగుతుంది.
ఇలా ఒక ప్రభుత్వం తప్పులు చేసి వాటికి మూల్యం చెల్లించిన తర్వాత మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తుంటే చరిత్ర పునరావృతం కాకుండా ఉంటుందా? ఆలోచిస్తే మంచిది.
హిస్టరీ రీవైన్డింగ్…. నాట్ గుడ్!