ktr-scam

ఫార్ములా 1 రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ నేడో రేపో అరెస్ట్‌ కావడం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ ఆయన ప్రగల్భాలు వింటుంటే తన ఆందోళనని కప్పి పుచ్చుకొని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు అనిపించకమానదు.

“రేవంత్ రెడ్డి నన్ను ఏదో విదంగా అరెస్ట్‌ చేసి లోపల వేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన వల్ల కావడం లేదు. అటువంటి మరో ప్రయత్నమే ఈ ఫార్ములా 1 రేసింగ్ కేసు. అసలు అవినీతే జరుగనప్పుడు ఇంక కేసు ఎలా నిలుస్తుంది? దేని కోసం ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన్నట్లు?

Also Read – వారసత్వంగా ఆస్తులే వస్తాయి.. పదవులు కావు!

ఇదో లొట్టిపిట్ట కేసు. హైకోర్టులో న్యాయమూర్తి అడుగుతున్న ప్రశ్నలకు ఏజీ సమాధానాలు చెప్పలేక తడబడుతున్నారు. హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఈ రేసు నిర్వహించాలని నేను అనుకున్నాను. రేవంత్ రెడ్డి వద్దనుకున్నారు. నామీద కేసు నమోదు చేసినప్పుడు ఆయనపై కూడా కేసు నమోదు చేయాలి కదా? రేవంత్ రెడ్డిలాంటి ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదు,” అని అన్నారు.

ఇదివరకు ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ, సీబీఐలు కేసు నమోదు చేసినప్పుడు కూడా కేసీఆర్‌, కేటీఆర్‌, కల్వకుంట్ల కవిత తదితరులు అచ్చం ఇలాగే మాట్లాడారు. సీబీఐ అధికారులు కల్వకుంట్ల కవితని హైదరాబాద్‌లో ఆమె నివాసం నుంచి అరెస్ట్‌ చేసి ఢిల్లీ తీసుకుపోతుంటే అదో తప్పుడు కేసు అని వాదించిన బిఆర్ఎస్ నేతలు ఎవరూ వారిని అడ్డుకోలేకపోయారు. ఆమె ఆరు నెలలు ఢిల్లీ తిహార్ జైల్లో ఉంటే విడిపించుకోలేకపోయారు. చివరికి బిఆర్ఎస్ పార్టీని పణంగా పెట్టి ఆమెను విడిపించుకోవలసి వచ్చింది.

Also Read – పాన్ ఇండియా స్థాయిలో వర్మ పాపాల పొద్దు..!

ఇప్పుడు ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో ‘కేసూ గీసూ లేదంటూ’ కేటీఆర్‌ జోకులు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపుకు చేస్తున్న కుట్ర.. కానీ ఫలించదని చెపుతున్నారు.

అయితే ఈ కేసులో ఈడీ కూడా జోక్యం చేసుకొని కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది కనుక కేటీఆర్‌ చెప్పినంత తేలికగా కొట్టిపడేయడానికి లేదు.

Also Read – వివాదానికి ‘విషెస్’ తో ముగింపా.?

ఏసీబీ అరెస్ట్‌ చేస్తే కేటీఆర్‌ సులువుగా బయటపడగలరేమో కానీ కేంద్రం అధీనంలో పనిచేసే ఈడీ అరెస్ట్‌ చేస్తే బయట పడటం చాలా కష్టమే. కల్వకుంట్ల కవిత కేసుతోనే ఇది తెలిసి వచ్చింది.




అరెస్ట్‌ అనివార్యమని ఆయనకు బాగా తెలుసు. కనుక ఆందోళన కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్‌ ఇలా ప్రగల్భాలు పలుకుతున్నారనుకోవచ్చు.