భాషలు: రాజకీయం ముందు తలవంచుతున్నాయా.?

How Telugu Political Language Is Hitting Rock Bottom

భాషా కేంద్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏపీ, తెలంగాణ అంటూ రెండుగా విడిపోయింది. అయితే ఇక్కడ రాష్ట్ర ఏర్పాటులో భాష ఎంత కీలక పాత్ర పోషించిందో రాష్ట్ర విభజనలో యాస అంతే ప్రముఖ పాత్ర తీసుకుంది.

అయితే రెండుగా విడిపోయిన తెలుగు జాతి తన భాష పట్ల యాస పట్ల ఎంతటి గౌరవాన్ని చూపిస్తుందో ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీలను, ఆయా పార్టీల నాయకులను చూస్తే యిట్టె అర్ధమవుతుంది. ఏపీలో వైసీపీ బలోపేతం తెలుగు భాషను బూతు భాషగా మార్చేసింది.

ADVERTISEMENT

ప్రభుత్వంలో ఉన్న నాయకులే నిత్యం మీడియా ముందుకొచ్చి బూతులతో విరుచుకుపడుతుంటే వైసీపీ ఏపీకి ఈ బూతు భాషనే రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించిందా అన్న అనుమానాలు కలిగాయి. వైసీపీ మంత్రులుగా పనిచేసిన కొంతమంది నాయకులు, మంత్రులు వాడిన ఈ భాష తో సదరు నేతలను బూతు నాయకులుగా పిలిచుకున్నారు ఏపీ ప్రజలు.

ఒకానొక దశలో వైసీపీ నేతల ప్రెస్ మీట్లకు కూడా సెన్సార్ పెట్టాలేమో అనిపించేంతగా వైసీపీ తెలుగు భాషను కూని చేసేసింది. చివరికి వైసీపీ హయాంలో టీవీ ల ముందు కూర్చుని అసెంబ్లీ సమావేశాలను కూడా చూడలేనంతగా వైసీపీ మాతృ భాష ను భ్రష్టు పట్టించింది.

అయితే ఈ సమస్య ఒక్క ఏపీకి మాత్రమే పరిమితం అవ్వలేదు, ఇందులో వైసీపీ ఒక్కటే దోషిగా మారలేదు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష బిఆర్ఎస్ వరకు ఆయా పార్టీల క్యాడర్ ని సంతోష పెట్టడానికి, తమ ప్రత్యర్థి పార్టీలను మానసికంగా కుంగదీయడానికి తెలంగాణ యాసకు బూతులు జోడిస్తున్నారు.

ఇందులో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటిషన్ కేసీఆర్ నుంచి ఆయన తనయుడు కేటీఆర్ వరకు, ఇక కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ నుండి బీసీల హక్కుల కోసం పార్టీ పెట్టిన తీన్మార్ వరకు ప్రతి ఒక్కరు వారి భాషను, యాసను రాజకీయాల కోసం దిగజారుస్తూనే వస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన రేవంత్ సైతం తన ప్రత్యర్థుల పై విమర్శలు చేసేందుకు ఒక మెట్టు కిందకి దిగి ఈ భాషా ప్రయోగంలో నోరు జారుతూనే ఉన్నారు. అది ఏ స్థాయికి చేరింది అంటే రేవంత్ భాష పై కేటీఆర్ సెటైర్లు కూడా వేస్తున్నారు.

రేవంత్ మీడియా ముందుకొస్తే టీవీ లను బంద్ చేయండి, లేకుంటే ఆ బూతుల భాషను విని చిన్న పిల్లలు పాడవుతారు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎవరైనా అటువంటి భాష వాడతారా.? ఆ భాష మాకు రాదా.? అంటూ రేవంత్ టార్గెట్ గా కేటీఆర్ పావులు కదుపుతున్నారు.

గతంలో కేసీఆర్ సైతం ఇటువంటి భాషతోనే ప్రభుత్వాన్ని నడిపారు, ప్రతిపక్షాన్ని తొక్కారు. కేటీఆర్ కూడా రేవంత్ పై రాజకీయ దాడి చేసే సమయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మరిచిపోయి దిగజారి మాటలు వదులుతారు. నిజంగా ఇటువంటి భాష వారి రాజకీయాలకే కాదు రాష్ట్రానికి కూడా మంచిది కాదు.

వైసీపీ ఇటువంటి భాషను ప్రయోగించి 151 సీట్లతో అందలం ఎక్కి ఇప్పుడు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పాతాళానికి పడింది. అధికారం అనేది ఎప్పుడు ఎవరికీ శాశ్వతం కాదు. అధికారాన్ని చూసుకుని రాజకీయాల కోసం ఒక మెట్టు దిగడం మొదలుపెడితే ఆ తరువాత ఎక్కడానికి మెట్లు కూడా కనిపించని స్థాయికి దిగజారుతారు.

ADVERTISEMENT
Latest Stories