హైదరాబాద్ జనులకు ‘మెట్రో’శుభవార్త!

Hyderabad metro rail ready to launchమొత్తానికి హైదరాబాద్ మెట్రో రైలు పరుగులు పెట్టడానికి ముహూర్తం కుదిరింది. అనుమానాలకు ఫుల్‌స్టాప్ పడింది. నగర మెట్రో కూతకు ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు శుభముహూర్తం ఓకే అయింది. మియాపూర్‌ నుంచి ప్రారంభించేందుకు సిద్దమైన ఈ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ 28న విమానంలో బేగంపేట చేరుకుని అక్కడి నుంచి మియాపూర్ వెళ్తారు.

ADVERTISEMENT

మధ్యాహ్నం 2 గంటలకు మెట్రో స్టేషన్‌తో పాటు అక్కడే ఏర్పాటు చేసిన మెట్రో పైలాన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం మెట్రో రైలుకు పచ్చజెండా ఊపి అదే రైలులో అమీర్‌పేట వరకు ప్రయాణిస్తారు. అమీర్‌పేట చేరుకున్నాక అక్కడి ఇంటర్ చేంజ్ స్టేషన్‌ను పరిశీలించిన మోడీ, తిరిగి అదే మార్గంలో మియాపూర్ చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు రూట్ మ్యాప్ తయారు చేశారు.

మియాపూర్‌లో ఏర్పాటు చేసే సభలో ప్రసంగించిన అనంతరం మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగే సదస్సుకు మోడీ హాజరవుతారు. ఇందుకోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, మెట్రోను మోడీ ప్రారంభించిన రోజు నుంచే ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో నగరవాసుల నుండి… ముఖ్యంగా సదరు ప్రాంతాలలో ఎక్కువగా ప్రణయాలు జరిపేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories