
క్రికెట్ అనే క్రీడ పుట్టి, అందులో టీం ఇండియా పెత్తనం చలాయించటం మొదలయ్యి అనేక దశాబ్దాలు అయినప్పటికీ, ఒక గడ్డ పై మనవాళ్ళు ఇప్పటికి పై చేయి సాధించేందుకు ఇంకా చెమటోడుస్తూనే ఉన్నారు. ఆస్ట్రేలియా, విండీస్, న్యూజిలాండ్, ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లా, పాకిస్తాన్.. ఇలా అనేక విదేశీ పిచ్లపై మనవాళ్ళు తమ ఆధిపత్యాన్ని చూపారు.
కానీ, ఇంగ్లాండ్ గడ్డ పై టీం ఇండియా ఇప్పటి వరుకు ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. 2021 -22 ఇంగ్లాండ్ టూర్ లో భారత జట్టు మాత్రం ఇంగ్లాండ్ ను చిత్తు చేసినంతా పని చేశారు. లండన్ లో జరిగిన రెండు టెస్ట్ ల ను గెలిచి, సిరీస్ లో 2 -1 తో ఆధిక్యం లో ఉన్న క్రమంలో, కరోనా మూలాన అప్పుడే ఆడవలసిన 5 వ టెస్ట్ ను నిరవధికంగా వాయిదా వేశారు.
Also Read – కవిత గెలుపు బిఆర్ఎస్ ఓటమా.?
ఏడాది కాలం తరువాత ఆడిన ఆ 5 వ టెస్ట్ ను గెలిచే స్టేజి నుండి మ్యాచ్ ను చేజార్చుకుని సిరీస్ ను సమం చేసుకుని డ్రాగా ముగించారు. అయితే, మరొక రెండు రోజుల్లో మళ్ళీ ఇంగ్లాండ్ గడ్డ పై భారత్ సిరీస్ ను ఆడనున్నారు. కానీ, ఈసారి భారత్ కు గత టూర్ లో ఉన్న సుఖ సౌకర్యాలు ఉండబోవు.
రోహిత్, విరాట్, అశ్విన్, పుజారా, రహానే వంటి టెస్ట్ స్పెషలిస్టులు ఈ ఇంగ్లాండ్ టూర్ కు భారత జట్టు తో కలిసి పయనించబోవట్లేదు. రోహిత్, విరాట్ మరియు అశ్విన్ లు తమ టెస్ట్ కెరీర్ కు వీడ్కోలు పలకగా, రహానే మరియు పుజారా లను సెలెక్షన్ కమిటీ గత ఏడాది కాలం నుండి దూరం పెడుతూనే వచ్చారు.
Also Read – పాపం రాజాసింగ్.. రాజీనామాతో రాజకీయ అనాధగా మారారు!
వీరికి బదులుగా, దేశవాళీ క్రికెట్ లో రాణించిన కరుణ్ నైర్ మరియు శార్దూల్, ఐపీఎల్ లో అలరించిన సుదర్శన్, ప్రసిద్, నితీష్ రెడ్డి, జురెల్, సుందర్ మరియు అర్షదీప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. మరి సీనియర్లు జడిసిన ఆ గడ్డ పై జూనియర్లు సిరీస్ ను ఒడిసిపట్టుకోగలరా..?