నిన్న మొదలయిన ఇండియా vs ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ లో టాస్ గెలిచి భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు 150 పరుగులకే చేతులెత్తేశారు. ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్ కు వలె బ్యాటర్ల వల్ల మరోసారి మ్యాచ్ చేజారిపోతుందేమో అన్న ఆందోళనలో ఉన్న భారత అభిమానులకు ఈ రోజు ఆ అనుమానాలు కాస్త తొలగాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని కేవలం 150 పరుగులకే ఆల్ అవుట్ అవ్వటం నిరాశపరిచినా, ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో మాత్రం భారత బౌలర్లు నిప్పులు చెరిగే బౌలింగ్ చేసారు. కెప్టెన్ బూమ్రా మరోసారి 5 వికెట్లు పడగొట్టాడు,డెబ్యూ బౌలర్ హర్షిత్ కు 3 ,సిరాజ్ కు 2 వికెట్లు దక్కగా ,ఆసీస్ ను కేవలం 104 పరుగులకే ఆల్ అవుట్ చేసి,46 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు టీం ఇండియా.

Also Read – ఎఫ్-1 కేసు: సుప్రీంకోర్టు సింపుల్‌గా తేల్చేసింది!

అయితే మొదటి రోజే బీ.జీ.టీ కే హైలైట్ అయిన ఆటగాళ్ల ఎగ్రెషన్ చూసాము. మార్నస్ మరియు హెడ్ ల వికెట్లు పడ్డాక భారత బౌలర్లు చేసిన సందడి మొదటి రోజుకే ఆకర్షణగా నిలిచింది. అయితే, రెండవ రోజు కూడా ఇది కొనసాగింది. ఐపీఎల్ 2024 లో కోల్కతా జట్టుకు ఆడిన స్టార్క్-హర్షిత్ ల మధ్య ఒక సరదా స్లెడ్జ్ మొదలయింది.

స్టార్క్ తన సీనియారిటీని గుర్తుచేస్తూ, ‘నేను నీకన్నా ఫాస్ట్ గా బౌల్ చెయ్యగలను’ అనగా, హర్షిత్ దానికి నవ్వుతూ బదులిచ్చారు. కానీ, భారత రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో జైస్వాల్ దీనికి బదులిచ్చారు. ‘నీవు నాకు చాల నెమ్మదిగా బౌల్ చేస్తున్నావ్’ అని స్టార్క్ కి బదులిచ్చాడు. మున్ముందు ఇలాంటి స్లేడ్జులు మరిన్ని వస్తాయనటంలో సంకోచమే లేదు.

Also Read – కౌశిక్ రెడ్డి…పార్టీ కోసమా..? పేరు కోసమా.?

ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాక,ఇక తన రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్, తొలుత అభిమానులు కాస్త కంగారు పెట్టినప్పటికీ కూడా, అసలు ఆసీస్ బౌలర్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా రాహుల్-యశస్వి రోజంతా వికెట్ పడకుండా ఆడగలిగారు. పైగా, గత 20 ఏళ్లలో మొట్ట మొదటి సారి ఫస్ట్ వికెట్ కు 100 + భాగస్వామ్యం చేశారు.

ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్ లో భారత బ్యాట్స్మన్ అంతా ఒక సెషన్ లో ఆల్ అవుట్ అయ్యారని ట్రోల్ చేసినవారికి, ఇవాల ఏకంగా రెండు సెక్షన్ల పాటు వికెట్ పడకుండా ఆడి, తమ సత్తా చూపించారు. ఇప్పటికే 172 పరుగులు చేసి, 218 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు భారత్. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండగా, ఆసీస్ ఎలా కమ్ బ్యాక్ ఇస్తారని చూడాలి.

Also Read – జగన్‌ స్కిల్ సుప్రీంకోర్టుకీ నచ్చలే!