పాకిస్తాన్ ను గుర్తు చేసిన టీమిండియా!

India vs New Zealand 2nd T20న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండవ టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓడిన తీరు అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది.197 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా బ్యాట్స్ మెన్లు ప్రదర్శించిన ఆటతీరు పాకిస్తాన్ జట్టును గుర్తుకు తెచ్చింది.

ADVERTISEMENT

భారీ లక్ష్యం ముందుందన్న ఆలోచనలతో బంతిని చూడకుండా ‘గుడ్డి ఊపుడు’ మాదిరి టీమిండియా బ్యాట్స్ మెన్లు ఆడడం విశేషం. అనటానికి, వినటానికి ‘గుడ్డి ఊపుడు’ అనేది మాస్ గా ఉన్నా… టీమిండియా బ్యాట్స్ మెన్లు మాత్రం అంతకంటే రోతగా ఆడారని చెప్పడంలో సందేహం లేదు.

గెలుపు ఓటములు మ్యాచ్ లో సర్వసాధారణం. ఖచ్చితంగా ఒక్క జట్టే గెలుస్తుంది, ప్రతిసారి అది టీమిండియానే కానక్కర్లేదు. అయితే భారీ లక్ష్యమన్న ఒత్తిడితో బంతిని చూడకుండా బ్యాట్ నుఅటు ఇటు తెగ తిప్పి, చివరికి పెవిలియన్ కు చేరుకొని ఓటమికి కారణమయ్యారు.

ఒక్క కెప్టెన్ విరాట్ కోహ్లి మినహాయిస్తే… అంతా అడ్డదిడ్డంగా బ్యాటింగ్ చేసి, లక్ష్య భారాన్ని మరింత పెద్దది చేసారనే చెప్పాలి. బంతిని చూసి ఆడితే ఎలాంటి అద్భుతమైన షాట్లను ఆడవచ్చో విరాట్ కోహ్లి చేసి చూపించాడు. అందుకే సరికొత్త రికార్డులకు వేదిక అవుతూ చరిత్రలో నిలిచిపోయే క్రికెటర్ గా అవతరిస్తున్నాడు.

ADVERTISEMENT
Latest Stories