నేడే ముగిసిన భారత్ vs న్యూజిలాండ్ రెండవ టెస్ట్ లో కూడా న్యూజీలాండ్ జట్టు 113 పరుగులతో మ్యాచ్ లో గెలిచి, సిరీస్ లో మరొక మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ, 2 -0 తో సిరీస్ కైవసం చేసుకున్నారు. అయితే, సొంత గడ్డ పై భారత్ ఈ స్థాయి లో విఫలం చెందడాన్ని ఏ క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నారు.
ముగిసిన మొదటి టెస్ట్ లో సైతం ఆల్మోస్ట్ ప్రతి సెషన్ లో భారత్ పై తమ ఆధిపత్యాన్ని చూపించారు న్యూజిలాండ్ టీం. తమ సొంత గడ్డ పై న్యూజీలాండ్ జట్టు ఈ రేంజ్ లో భారత్ ఆటగాళ్లను తొక్కేస్తుంది అని ఈ సిరీస్ మునుపు వరకు ఏ భారత అభిమాని అనుకోలేదు.
మొదటి మ్యాచ్ ఓడిపోయినా, రెండవ మ్యాచ్ లో మంచి కమ్ బ్యాక్ ఇచ్చి సిరీస్ ను సమం చేస్తారనుకున్న ఫాన్స్ కు నేడు చేదు అనుభవం ఎదురయ్యింది. అయితే, ఈ మ్యాచ్ ఓడిపోవటం తో సిరీస్ ను కోల్పోయిన భారత్, పుష్కర కాలం తరువాత సొంత గడ్డ పై సిరీస్ ఓడి, వరుసగా 18 అపజయాలను దాటినా ఘనతకు చెక్ పెట్టుకుంది.
అయితే, న్యూజిలాండ్ జట్టు మొదటిగా 1955 లో తొలి సారి భారత గడ్డ పై అడుగుపెట్టి టెస్ట్ సిరీస్ ఆడినప్పటికీ, సుమారు 69 ఏళ్ళ పాటు వారు టీం ఇండియా పై ఒక్క సిరీస్ ను కూడా గెలవలేదు. తమ 69 ఏళ్ళ ప్రయాణం లో భారత్ పై భారత్ లో ఒక్కటంటే ఒక్క సిరీస్ ను కూడా నెగ్గని న్యూజీలాండ్ జట్టు నేటితో ఆ పరంపర కు ఫుల్ స్టాప్ పెడుతూ, భారత గడ్డ పై తొలి సారి తమ జట్టు ఆధిపత్యాన్ని రుచి చూపారు.
ఈ సిరీస్ కు ముందు, శ్రీలంక తో జరిగిన సిరీస్ లో 0 -2 తో వైట్ వాష్ అయిన జట్టు, నేడు ప్రపంచంలోనే అగ్ర టెస్ట్ జట్టు పై సజావు గా విజయాన్ని అందుకున్నారు. అయితే, ఈ సిరీస్ ఓటమికి ముఖ్యమైన కారణం “బ్యాట్టింగ్ వైఫల్యం”. ఆడిన ప్రతి ఇన్నింగ్స్ లో నూ,సెట్ అయిన బ్యాటర్ అవుట్ అవ్వగానే, తరువాతి బ్యాటర్లు అంత పేకమేడ లా కూలిపోయి వికెట్లు సమర్పించుకున్నారు.
అయితే, ఈ సిరీస్ ఓటమి భారత జట్టు కు కేవలం ఒక పీడకలే కాదు, దీనిని భారత జట్టు మొత్తం ఒక గుణపాఠం గా తీసుకుని, వచ్చే టెస్ట్ లో గెలిచి పరువు కాపాడుకుని, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అడుగులు జాగ్రత్తగా వేసేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.
భారత్ వంటి ఉన్నత జట్టు ఒక్క సిరీస్ ఓటమి తో క్రుంగి పోదు, వారు దీనిని ఒక పాఠం గా తీసుకుని కచ్చితంగా కమ్-బ్యాక్ చేస్తారంటున్న క్రికెట్ దిగ్గజాలు. ఇన్నేళ్ల న్యూజిలాండ్ పోరాటానికి టీం ఇండియా ఈనాడు తల వంచినట్లుగా భావించి ఇది ‘ఓటమి కాదు అవమానం’ అంటూ క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియాలో తమ భావోద్వేగాలను పంచుకుంటున్నారు.




