ఐపీఎల్ ‘సెంటిమెంట్’తో కెప్టెన్లకు పండగ!

IPL 2017 Latest Newsక్రికెట్ లో సెంటిమెంట్స్ కు కొదవలేదన్న విషయం క్రికెట్ ప్రేమికులకు తెలిసిందే. ఈ విషయాన్నే త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘జులాయి’ సినిమాలో కాస్త ఎటకారాన్ని జోడించి మరీ చూపించారు. గత ఐపీఎల్ సీజన్ లో కూడా మొత్తంగా ఒక సెంటిమెంట్ పాపులర్ అయ్యింది. ఏ జట్టైతే సెకండ్ బ్యాటింగ్ (లక్ష్య చేధన) చేస్తుందో, ఆ జట్టు ఎక్కువ మ్యాచ్ లలో విజయాన్ని సాధించింది. టోర్నీ సగం పూర్తయ్యే సమయానికి ఈ సెంటిమెంట్ ను గ్రహించిన కెప్టెన్లు, అందుకు అనుగుణంగానే టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకునేవారు.

తాజాగా ఐపీఎల్ సీజన్ 10లోనూ ఇదే సెంటిమెంట్ కొనసాగుతున్నట్లుగా అర్ధమవుతోంది. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ మినహా, మిగతా మ్యాచ్ లలో ఫలితాలు సెకండ్ బ్యాటింగ్ చేసిన వారికే అనుకూలంగా రావడంతో టాస్ గెలిచిన వారంతా ఏ మాత్రం సంశయించకుండా, ఫీల్డింగ్ ను ఎంచుకుంటున్నారు. అంతేకాదు అందుకు తగిన విధంగానే తమ వైపుకు ఫలితాలను రాబట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. ముంబై, గుజరాత్ లయన్స్ లు 180కి పైగా పరుగులు చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసిన పూణే, కోల్ కతా జట్లు అవలీలగా చేధించాయి.

ADVERTISEMENT

ఈ ‘కిటుకు’ కనిపెట్టిన కెప్టెన్లు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి, టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంపిక చేసుకుంటున్నారు. పూణే – పంజాబ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లోనూ టాస్ గెలిచి మాక్స్ వెల్ ఫీల్డింగ్ ను ఎంచుకుని, పూణేను కేవలం 163 పరుగులకే కట్టడి చేయడంతో, ఈ మ్యాచ్ లోనూ సెకండ్ బ్యాటింగ్ చేసే పంజాబ్ కే విజయావకాశాలు ఎక్కువన్న విషయం దాదాపుగా ఖరారైంది. దీంతో తదుపరి మ్యాచ్ లలో కెప్టెన్లకు మరొక ఆప్షన్ లేకుండా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడమే తరువాయి అన్నట్లుగా మారింది.

ADVERTISEMENT
Latest Stories