IPL 2025 - CSK VS RCB Match

ఈ 18 వ ఐపీఎల్ సీజన్ కు అత్యధిక ప్రాముఖ్యత సంపాధించుకున్న మ్యాచ్ ఏంటా అంటే, ఐదు ఐపీఎల్ ట్రోఫీలను దక్కించుకున్న CSK VS ఒక్క ట్రోఫీని కూడా ముద్దాడని RCB అనే చెప్పాలి. నేడు చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు నేత్రానందాన్ని, శ్రవణానందాన్ని కలిగించనుంది. దీనికి కారణం గతేడాది ఈ మ్యాచ్ ఇచ్చిన షాక్లను ఇంకా మరువలేదు ఐపీఎల్ ఫాన్స్.

సెమిస్ కు చేరాలంటే రెండు జట్లు ఆ మ్యాచ్ లో గెలవాల్సి ఉండగా, ఆర్.సి.బీ జట్టు మాత్రం18 లేదా అంతకంటే ఎక్కువ పరుగులతో గెలవాల్సిన పరిస్థితి. అయితే ఆ మ్యాచ్ లో ఆర్.సి.బీ కావాల్సిన పరుగుల కంటే ఎక్కువ పరుగులతోనే ధోని సేన మీద గెలిచి సెమిస్ కు చేరుకున్న బెంగళూర్ టీం రాజస్థాన్ మీద ఓడి చెన్నై ఆశలను నేలరాసింది. ఆ మ్యాచ్ చేసిన గాయం నుండి ఇంకా సి.ఎస్.కే జట్టు అభిమానులు కోలుకోలేదు.

Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!

ఏదేమైనప్పటికీ ఈ రెండు జట్లు తలపడినప్పడు నిస్సందేహంగా చెన్నై జట్టే ఫెవరెట్స్ గా బరిలోకి దిగుతారు. ఐపీఎల్ అంటేనే బెట్టింగ్ రాజాలకు పండగ వంటిది. అలాంటిది ఆర్.సి.బీ మరియు చెన్నై వంటి జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇక బెట్టింగ్ రాజాలకు నిద్రే కరువాయే అనే పరిస్థితే. ప్రస్తుతం ఈ మ్యాచ్ కోసం యావత్ ఐపీఎల్ ప్రపంచం ఎదురుచూస్తుంది.

ఈ మ్యాచ్ జరగబోయే మూడు రోజుల ముందు నుండి బ్రాడ్కాస్టింగ్ యాజమాన్యం ‘స్టార్ స్పోర్ట్స్’ దేశం మొత్తం ఒక సర్వే వంటిది చేసారు. అయితే, ఇందులో 3 సార్లు ఫలితాలను విడుదల చేయగా, ఒకసారి ‘తల ధోని’ కు మద్దతుగా ఎక్కువ మంది ఉన్నట్టు, మరోసారి ‘కింగ్ కోహ్లీ’ అంటూ , చివరిగా జట్టు గా సి.ఎస్.కే – ఆర్.సి.బీ ఇరు జట్లకు 50 -50 ఫలితాలుగా వచ్చాయి.

Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.

మరి ఈ సంవత్సరం ఈ ఇరు జట్లను చూస్కుంటే, ఇద్దరు తాము ఆడిన మొదటి మ్యాచ్ లో ఘనమైన విజయం పొందే ఈ మ్యాచ్ కు సిద్ధమవుతున్నారు. చెన్నై జట్టు కు ఇది హోమ్ గ్రౌండ్ కావడంతో వారికి గెలిచే అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. అయితే, ఈ ఏడు ఆర్.సి.బీ జట్టును కూడా తీసిపడేసేందుకు లేదు. వారు తమ మొదటి మ్యాచ్ లో కోల్కతా జట్టును కోల్కతా లోనే చిత్తు చేసి తమ 17 ఏళ్ళ ప్రతీకారానికి బదులు తీర్చుకున్నారు..

జట్టు కూర్పులు, ఇరు జట్లకు ఉన్న ఫ్యాన్-బేస్, రెండు జట్ల ప్రస్తుత ఫామ్, కోహ్లీ – ధోని వీరిద్దరి క్రేజ్ పరంగా కూడా CSK , RCB రెండు సమఉజ్జిలుగానే మైదానంలో తలపడనున్నారు. అలాగే ధోని, కోహ్లీ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పై కనపడనున్నారనే వాస్తవం, ఇలా అన్ని కోణాల నుండి రెండు జట్ల అభిమానులు మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?

ఇలా క్రికెట్ అభిమానులు, ఐపీఎల్ భక్తులు ఒకపక్క నరాలు తెగే ఈ ఉత్కంఠ మ్యాచ్ పై ఆసక్తి కనపరుస్తుంటే, ఇటు బెట్టింగ్ రాజాలు మాత్రం కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ లకు సిద్ధమవుతున్నారు. ఇటువంటి కీలకమైన మ్యాచ్ లలో బెట్టింగ్ మాఫియా తన పంజా విసురుతుంది. ఐపీఎల్ అభిమానులకు RCB అనేది ఒక లాయల్ ఎమోషన్ అయితే CSK అనేది ఒక బలమైన భావోద్వేగం వంటిది.

వీటన్నిటిని తమకు అనుకూలంగా కాష్ చేసుకోవడానికి, ఆటను వినోదంలా కాకుండా ఒక అక్రమ వ్యాపారం లా మార్చేస్తున్నారు ఈ బెట్టింగ్ మాఫియా. ఈ మాఫియా ఉచ్చులో పడి అనేకమంది అమాయకులు ఆర్ధికంగా చితికిపోయిన ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.




అయినా వీటి పై అధికారులు తమ అధికార జులం ప్రదర్శించలేకపోతున్నారు, వీరి ఆటను కట్టడి చేయలేకపోతున్నారు. దీనితో ఐపీఎల్ ఆడే వారికీ, చూసే వారికే కాదు తెర వెనుక దండాలు నడిపే వారికీ కూడా మంచి కిక్ ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదనిచెప్పొచ్చు.