sachin-tendulkar-virat-kohli-sunil-narine-ms-dhoni

ఐపీఎల్ అనే లీగ్ మొదలయ్యి ఈ సంవత్సరానికి సరిగ్గా 18 ఏళ్ళు పూర్తికాగా, ఈ 18 ఏళ్లలో కేవలం ఐదుగురు (5 ) ఆటగాళ్లు మాత్రమే ఒక్క ఫ్రాంచైజ్ తరపునే తమ ఆటను కొనసాగించారు. వారి ఈ ఐపీఎల్ కెరీర్ మొత్తం ఆ ఒక్క జట్టు కే పరిమితమయ్యారు.అలాగే ఆ ఫ్రాంచైజీలు కూడా వారిని ఆ జట్టు యొక్క గౌరవం గా భావించారు.

Also Read – నాడు – నేడు ప్రజా నాయకుడేనా….

అందులో మొట్టమొదటిగా, 2008 లో తొలి ఐపీఎల్ ఆక్షన్ లో అండర్-19 క్యాటగిరీ ఆటగాడిగా “విరాట్ కోహ్లీ” ను బేస్ ప్రైజ్ 20 లక్షలకే ‘ఆర్.సి.బీ’ సొంతం చేసుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు విరాట్ మీద ఆర్.సి.బీ ఎనలేని నమ్మకాన్ని చూపిస్తూనే వస్తుంది. అలాగే విరాట్ కూడా ఆ జట్టు జయాపజలతో సంబంధం లేకుండా అదే జట్టుకి కట్టుబడి ఆ ఆజట్టుకు ఐపీల్ కప్పు అందించడానికి పోరాడుతూనే ఉన్నాడు.

ఇక, రెండవ ఆటగాడిగా, క్రికెట్ దేవుడు “సచిన్ టెండూల్కర్” కూడా తన ఐపీఎల్ కెరీర్ మొత్తం లో కేవలం ‘ముంబై ఇండియన్స్’ జట్టు తరుపున మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. తాను అంతర్జాతీయ ఆట లో చూసినంత సక్సెస్ ను ఐపీఎల్ లో సచిన్ చూడలేకపోయారు. 2008 – 2011 మధ్యలో ముంబై జట్టుకు సారధిగా వచించారు సచిన్.

Also Read – అయితే కొడాలి నానికి ముహూర్తం పెట్టేసినట్లేగా?

ముచ్చటిగా మూడవ ఆటగాడు, భారత మాజీ కెప్టెన్, మూడు అంతర్జాతీయ ట్రోఫీలు కలిగిన ఏకైక కెప్టెన్ “ఎం.ఎస్.ధోని”. 2007 లో భారత్ ను టి-20 వరల్డ్ కప్ విజేతలుగా నిలబెట్టిన సారధి ‘ధోని’ కి 2008 ఆక్షన్ లో భారీ బిడ్డింగ్ నెలకొంది. అయితే చివరికి ‘చెన్నై సూపర్ కింగ్స్’ జట్టు ఈ పెద్ద పేరును సొంతం చేసుకుంది.

ఆయన ఆ జట్టును ఏకంగా ఐదు (5 ) సార్లు ఛాంపియన్స్ గా నిలబెట్టారు. ఇక, 2016 -17 మధ్యలో చెన్నై ఫ్రాంచైజ్ బాన్ కారణంగా, ‘రైసింగ్ పూణే సూపర్ జయింట్స్’ కు కూడా ప్రాతినిధ్యం వహించారు ధోని. అంతర్జాతీయ రిటైర్మెంట్ తరువాత ధోని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ‘రిషబ్ పంత్’ కూడా తన ఐపీఎల్ మొత్తం ఒక్క జట్టుకే ఆడారు.

Also Read – హింసలోనే క్రెజ్ వెతుకుతున్న ప్రేక్షకులు, దర్శకులు…!

నాలుగవ ఆటగాడిగా,ఢిల్లీ కు చెందిన “రిషబ్ పంత్” తన హోమ్ టీం ‘ఢిల్లీ క్యాపిటల్స్’ కే తన ఆట సేవలను అందించారు. 2016 లో ఐపీఎల్ డెబ్యూ చేసిన పంత్, గత 8 ఏళ్లగా ఒక్క జట్టుకే ఆడుతున్నారు. 2025 మెగా ఆక్షన్ కు కూడా ఢిల్లీ యాజమాన్యం పంత్ ను రెటైన్ చేసుకోవటం ఖాయం గా కనబడుతుంది. తన ఆటతీరు తో మ్యాచ్ చూసే సగటు అభిమానిని ఎంటర్టైన్ చేస్తుంటాడు పంత్.

ఐదవ ప్లేయర్ గా, వెస్ట్ ఇండీస్ ఆటగాడు “సునీల్ నరైన్” నిలిచారు. 2012 లో ‘కోల్కతా నైట్ రైడర్స్’ జట్టులో భాగమయ్యారు నరైన్. అక్కడినుండి, తన బౌలింగ్ సామర్ధ్యం మరియు బ్యాటింగ్ లో వీరోచితమైన హిట్టింగ్ తో ఇంకా అదే జట్టు తరుపున ఆడుతున్నారు. వయసు పెరుగుతుండగా, తన ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది ఆ జట్టు లో.




ఇలా, తమ కెరీర్ మొత్తం ఒక్క టీం కే ఆడటం అనేది అస్సలు సులువైన విషయం కాదు. జట్టు యాజమాన్యం తో చాకచక్యం గా ఉంటూ, వారిని మెప్పిస్తూ, వారి మెప్పును పొందుతూ, ఒక జట్టు లో ఇన్నేళ్లు ఆడటం మాములు విషయం కాదు. ఇందులో, జట్టు యాజమాన్యం యొక్క గొప్పతనం, ఆ ఆటగాళ్ల నిబద్దత మనకి కనపడుతుంది. అలా “ఒక్కటంటే ఒక్కటే” టీం కు ఆడిన 5 ఆటగాళ్లు వీరే.