టీమిండియా ఓటమికి కారణమైన “మూడు” బంతులు!

Is this why Team India lost t20 world cup?విండీస్ తో జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా అనూహ్య ఓటమి చవిచూసింది. భారీ స్కోరు సాధించడం, వెనువెంటనే భయంకర బ్యాట్స్ మెన్ గేల్ ను పెవిలియన్ బాట పట్టించడంతో ఖచ్చితంగా గెలుస్తుందన్న భావన వీక్షిస్తున్న క్రికెట్ అభిమానులతో పాటు మైదానంలో ఆడుతున్న భారత ఆటగాళ్ళ మదిలో కూడా ఖరారైనట్లుంది. ఆ ప్రభావం ఏమిటో మైదానంలో ఫీల్డింగ్ లో ప్రస్పూటంగా కనపడింది.

ఓ పక్కన వికెట్లు పడుతున్నా, రన్ రేట్ పెంచుకుంటూ విండీస్ బ్యాట్స్ మెన్లు పరుగులు సాధిస్తున్నా, కట్టడి చేయడంలో అటు భారత బౌలర్లు గానీ, కెప్టెన్ ధోని గానీ ఎంటువంటి ప్రయత్నమూ చేయలేదు. బహుశా మ్యాచ్ ను గెలిపించే దాకా విండీస్ బ్యాట్స్ మెన్లు ఆడలేరు అని భావించారో ఏమో గానీ, భారత బౌలర్లు వేస్తూనే ఉన్నారు… విండీస్ బ్యాట్స్ మెన్లు కొడుతూనే ఉన్నారు. అయితే ఈ మధ్యలో వచ్చిన ఓ “మూడు” అవకాశాలను కూడా ‘నో’ బాల్స్ రూపంలో వేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా భారత ఓటమికి ఆ “మూడు” బంతులే ప్రధాన కారణమయ్యాయి.

ADVERTISEMENT

ఒకటి… సిమ్మన్స్ 18 పరుగుల వద్ద ఉన్నపుడు… అశ్విన్ వేసిన ‘నో’ బాల్, విండీస్ పాలిట వరమైంది. ఆఫ్ సైడ్ వేసిన బంతిని సిమ్మన్స్ కట్ చేయగా, బూమ్రా అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. అది కాస్త ‘నాటౌట్’ కావడంతో, ఆ తర్వాత సిమ్మన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మళ్ళీ అలాంటి పొరపాటే చేయడం హార్దిక్ పాండ్య వంతు వచ్చింది. హార్దిక్ వేసిన ఫుల్ టాస్ బంతిని నేరుగా అశ్విన్ కు అందించిన సిమ్మన్స్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే మరోసారి ‘నో’ బాల్ అని తేలడంతో, వెళ్ళిపోతున్న సిమ్మన్స్ మళ్ళీ క్రీజులోకి వచ్చి వెనువెంటనే సిక్సర్ బాదాడు.

ఆ తర్వాత 18వ ఓవర్ వేసిన బూమ్రా తొలి మూడు బంతులను డాట్స్ వేసి భారత్ లో ఆశలు చిగురింపచేయగా, నాలుగవ బంతిని గాల్లోకి సిమ్మన్స్ లేపగా, బౌండరీ లైన్ వద్ద జడేజా క్యాచ్ అందుకుని, బౌండరీ లైన్ దాటబోయే ముందు విరాట్ కోహ్లికి బంతి అందించాడు. అయితే అంతకుముందే జడేజా కాలు బౌండరీ లైన్ కు తగలడంతో ‘అవుట్’ కాస్త ‘సిక్సర్’ గా మారింది. ఇక్కడ జడేజా ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేదన్న అభిప్రాయం అభిమానుల్లో కలగడం సహజమే. ఇలా మైదానంలో చేసిన చిన్న చిన్న తప్పిదాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ADVERTISEMENT
Latest Stories