వైసీపీ అరటిపళ్ళు కేజీ 50 పైసలు మాత్రమే!

Jagan Mohan Reddy’s 50-paise banana price claim causing political debate in Andhra Pradesh

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా బజారులో అరటిపళ్ళు కనీసం డజను రూ.60 నుంచి 100 వరకు ఉన్నాయి. అదే దేశవాళి అయితే రూ.60-70 వరకున్నాయి. అదే… కేజీలలో వాటి ధర మరింత ఎక్కువ ఉంటుంది.

మొన్నటి వరకు కార్తీక మాసం ఎఫెక్ట్ వలన అరటిపళ్ళకే కాదు… అరటి ఆకులు, అరటి దొప్పలకు కూడా డిమాండ్ పెరిగింది. కనుక వాటి రేట్లు పెరిగి పోయాయి.

ADVERTISEMENT

ఇప్పుడు అయ్యప్ప స్వాముల పుణ్యమాని మళ్ళీ మరోసారి వాటి రెట్లు పెరిగిపోయాయి. కనుక సామాన్య ప్రజలకు అరటిపళ్ళు ‘లగ్జరీ ఐటెం’గా మారిపోయాయి.

కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేజీ అరటిపళ్ళు 50 పైసలు మాత్రమే! అంటున్నారు. “హలో ఇండియా, ఓసారి ఏపీవైపు చూడండి… మా రాష్ట్రంలో అరటిపళ్ళ ధర కేజీ 50 పైసలు మాత్రమే.

ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్‌ కన్నా చవక. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమే.

అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటా వరకూ… ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇది,” అని జగన్‌ ట్వీట్ చేశారు.

బజారులో ఉల్లి ధర ప్రస్తుతం కేజీ రూ.20-25 ఉండగా, టమాటో ధర కేజీ రూ.50-60 మద్యన ఉంది. కానీ ‘ఆలుగడ్డ అంటే పోటాటోయేనా?’ అని అడిగే జగన్‌కి మార్కెట్లో ఉల్లి, టమాటో, అరటిపళ్ళు ధరలు, వాటి గిట్టుబాటు ధరల గురించి ఇంత విషయ జ్ఞానం ఉందంటే చాలా హాశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా!

ఇదివరకు మామిడి పళ్ళ సీజనులో ధరలు తారా స్థాయిలో ఉన్నప్పుడు కూడా, జగన్‌ ఇలాగే మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదంటూ చిత్తూరు బయలు దేరారు. ఆయన పర్యటనని హైలైట్ చేసేందుకు వైసీపీ నేతలు చుట్టుపక్కల గ్రామాల నుంచి ట్రాక్టర్లతో మామిడి పళ్ళు తెప్పించి రోడ్లపై పోయించారు. వాటిని చూపిస్తూ జగన్‌ నీచ రాజకీయాలు చేశారు. అదే జగన్‌ ఇప్పుడు అరటిపళ్ళు ఫోటోలు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు అంతే!

రాష్ట్రంలో సామాన్య ప్రజలు అరటిపళ్ళు కొనలేని స్థాయిలో ధరలు మండిపోతుంటే, కేజీ 50 పైసలకే లభిస్తున్నాయంటూ జగన్‌ ట్వీట్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

జగన్‌కి తనని గద్దె దించినందుకు సిఎం చంద్రబాబు నాయుడుపై ద్వేషం ఉంటే ఉండొచ్చు. కూటమి ప్రభుత్వం పాలన బాగోలేదని విమర్శించినా ఎవరూ తప్పు పట్టరు.

కానీ చంద్రబాబు నాయుడుపై ఈర్ష్య, ద్వేషంతో నాడు అమరావతి పాడు బెట్టి ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టకు భంగం కలిగించిన జగన్‌ నేడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్ట దెబ్బ తీసేందుకే ఇలా ఇంగ్లీషులో కూడా ట్వీట్ చేశారని చెప్పక తప్పదు.

టిటిడీకి చైర్మన్లుగా చేసిన వైసీపీ నేతలు ఆ తిరుమల ప్రతిష్టని దెబ్బ తీశారు. ఏపీకి ముఖ్యమంత్రిగా చేసిన జగన్‌ ఏపీ ప్రతిష్టని ఈవిధంగా దెబ్బ తీస్తున్నారు. ఇలా వ్యవహరిస్తుంటే ఏపీ ప్రజలు జగన్‌ని ఎప్పటికైనా క్షమిస్తారా?

ADVERTISEMENT
Latest Stories