
నిన్న సత్తెనపల్లిలో జగన్ పర్యటించినప్పుడు కొందరు వైసీపీ కార్యకర్తలు “2029లో మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్పా నరుకుతాం నా కొడకల్లారా..” అంటూ జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలను ప్రదర్శించి, రాష్ట్రంలో తమ రాజకీయ ప్రత్యర్ధులను హెచ్చరించారు.
Also Read – అసెంబ్లీ వద్దు మీడియానే ముద్దా.?
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ‘చొక్కా చేతులు మడిచి యుద్ధానికి సిద్దం’ అంటూ రాష్ట్రమంతా పోస్టర్స్ వేసుకున్నప్పుడు, వైసీపీ కార్యకర్తలు చేసిన ఈ పనిని తప్పు పడతారనుకోలేము.
ఈరోజు తాడేపల్లి ప్యాలస్‌లో మీడియా దీని గురించి అడిగినప్పుడు, పుష్ప-2లో ఆ రప్పా రప్పా డైలాగ్స్ తనకు తెలియవన్నట్లు వారిచేత చెప్పించి, “అవి సినిమా డైలాగులు కదా.. వాటిని పలికినా కేసులు నమోదు చేస్తారా?
Also Read – లేని వారి కోసం పోస్టులు..ఉన్న వారి పై కేసులా..?
పుష్ప-2లో అల్లు అర్జున్‌లా గడ్డం కింద చేయి తిప్పుతూ “రేపు ఇలా చేయి తిప్పినా కేసు నమోదు చేస్తారేమో? మనం ఎక్కడ ఉన్నాం.. ప్రజాస్వామ్యంలోనేనా? లేదా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్న రాష్ట్రంలోనా?” అంటూ జగన్ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
ఇంతకాలం జగన్ ప్రాణ భయం లేదా అరెస్ట్ భయంటో ప్యాలస్ నుంచి బయటకు రావడం లేదనుకునేవారు. తనకు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా భద్రత కావాలంటూ కేంద్ర హోంశాఖకి జగన్ లేఖ వ్రాయడమే ఈ అపోహకు కారణం అయ్యుండవచ్చు.
Also Read – జగన్‌వి శవరాజకీయాలట .. ఎంత మాటనేశారు నారాయణా?
కానీ జగన్ బయటకు వస్తే ఆయన ప్రాణాలకు కాదు.. ప్రజల ప్రాణాలకే ప్రమాదమని నిన్నటి పర్యటనలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలే సాక్ష్యం.
తాము అధికారంలోకి వస్తే తలకాయలు నరుకుతామని బెదిరిస్తూ వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించడాన్ని జగన్ వెనకేసుకు రావడం చూస్తే, తన మనసులో మాటనే వారి ద్వారా ఆ విదంగా చెప్పించారని అనుమానించక తప్పదు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏవిదంగా వ్యవహరిస్తారో ఓసారి సిఎం చంద్రబాబు నాయుడుతో సహా అందరికీ రుచి చూపారు. ఇప్పుడు మళ్ళీ వస్తే ఏం చేయబోతున్నానో చాలా నిర్భయంగా చెపుతున్నారు కూడా. కనుక ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది కూటమి ప్రభుత్వం, ప్రజలే! లేకుంటే రప్పా రప్పా తప్పదు!