
సింగయ్య మృతి కేసులో ఏ-2 గా పేర్కొనబడిన జగన్, తనపై ఆ కేసు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో మొన్న క్వాష్ పిటిషన్ వేశారు. దానిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణని జూలై 1కి వాయిదా వేస్తూ అంతవరకు జగన్‌పై ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
Also Read – కమల్ హాసన్‌కి మాత్రమే న్యాయం…. చాలుగా!
ఈ సందర్భంగా హైకోర్టు పోలీసులను ఈ కేసు గురించి వివరాలు అడుగగా, ఈ ప్రమాదానికి జగన్ ఏవిదంగా బాధ్యుడని పేర్కొన్నారు?అని పోలీసులను నిలదీసిందని సొంత కవిత్వం చెప్పుకుంది. జగన్‌పై ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ తీర్పుని వాయిదా వేయడం అంటే జగన్ నిరపరాధి, అప్పుడే ఈ కేసు గెలిచేసినట్లే అని వైసీపీ సొంత భాష్యం చెప్పుకుంటోంది. అయితే ఈ కేసుని కొట్టేయాలనే జగన్ అభ్యర్ధనని పరిశీలించకుండా జూలై 1కి వాయిదా వేసిందనే విషయం చెప్పుకోలేదు. అంటే ‘అశ్వధామ హతః కుంజరః’ అన్నట్లు అనుకోవాలన్న మాట!
జగన్ పరామర్శ యాత్రకి పోలీసులు 100 మందికి మాత్రమే అనుమతించినా వేలాదిమందితో బల ప్రదర్శన యాత్రగా మార్చడం, ఆయన కారు కింద పడి సింగయ్య చనిపోవడం అన్నీ నిజమే అయినప్పుడు ఈ కేసు విచారణ వాయిదా పడగానే, ఈ కేసు నుంచి విముక్తి లభించినట్లు అప్పుడే పండగ చేసుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి అభ్యంతరం?