ys-jagan-chandrababu-naidu

గత 5 ఏళ్ళ జగన్‌ పాలన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, ప్రతిపక్ష పార్టీలకు కూడా ఓ పీడకల వంటిది. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, వైసీపి నేతల బూతులతో జగన్‌ రాష్ట్రంలో ఓ సరికొత్త రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దాదాపు అందరూ ఏదో ఓవిదంగా ఆ దుసంస్కృతితో బాధపడినవారే.

Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.

సామాన్యులు వైసీపి నేతల దౌర్జన్యాలు, భూకబ్జాలకు గురైతే, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు రాజకీయ కక్ష సాధింపులకు బలయ్యారు.

అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడబలుక్కునట్లు జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేశారు. అయినా నేటికీ జగన్‌లో ఎటువంటి పశ్చాత్తాపం లేదు. ఆయన ధోరణిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు.

Also Read – మేలు చేస్తే ఎన్నికల వరకే అభివృద్ధి చేస్తే…

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో వైసీపి కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఇటువంటి దుసాంప్రదాయం ప్రవేశపెడుతున్నారు. అయితే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కనుక మాపై దాడులు చేయిస్తున్నా మేమేమీ చేయలేకపోవచ్చు.

కానీ రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము. అప్పుడు మా పార్టీ కార్యకర్తలు కూడా ఇలాగే మీ అందరిపై ప్రతీకారం తీర్చుకోకుండా ఉండరు. అప్పుడు వారిని నేను కూడా ఆపలేను. కనుక ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ దుసంప్రదాయాన్ని ఇక్కడితో ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని జగన్‌ హెచ్చరించారు.

Also Read – చంద్రబాబు నాయుడు @75: అదే పోరాటస్పూర్తి

రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉండేది. టిడిపి కూటమి ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి, అమరావతి గురించే ఆలోచించేవారు తప్ప మరో ధ్యాస ఉండేదే కాదు.

అప్పుడూ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఇప్పుడూ ఆయనే ఉన్నారు. అప్పుడూ అమరావతి, రాష్ట్రాభివృద్ధి గురించే ఆలోచించారు. ఇప్పుడూ అదే ఆలోచిస్తున్నారు.

కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ జగన్‌ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుండటాన్ని ఏమనుకోవాలి?

రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, రౌడీఇజాన్ని విస్తరించిందే వైసీపి. అటువంటి జగన్, వైసీపి పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ సిఎం చంద్రబాబు నాయుడు సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు కూడా. కానీ చంద్రబాబు నాయుడుని జగన్‌ ఈవిదంగా విమర్శిస్తున్నారు.

ఎప్పుడు ఏ కేసులో జైలుకి వెళతారో తెలియని పరిస్థితిలో ఉన్న జగన్‌, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటూ, ముఖ్యమంత్రి కాగానే టిడిపి తాట తీస్తానని సిఎం చంద్రబాబు నాయుడుని బెదిరిస్తుండటం చూస్తే, అది దూకుడే అనుకోవాలో మూర్ఖత్వమే అనుకోవాలో అర్దం కాదు.

కానీ టిడిపిని రెచ్చగొట్టి తన ఉచ్చులోకి లాగి, రాష్ట్రంలో నిజంగానే శాంతి భద్రతలు క్షీణించేలా చేయాలనే జగన్‌ దురాలోచన కనబడుతోంది.




ఏది ఏమైనప్పటికీ టిడిపికి తనని రాజకీయంగా ఎదుర్కోవలసిన సమయం వచ్చిందనే జగన్‌ సూచిస్తున్నారు. ఆయనే చాలా తొందరపడుతున్నారు కూడా. కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ రాజకీయ చదరంగంలో ఇప్పుడు ఆయన పావులు కదపాల్సిన సమయం వచ్చింది.