ఈ సృష్టిలో ప్రతీ జీవికి ఓ ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. కుక్కకు విశ్వాసం, తేళ్ళు, పాములకు విషం వంటివి ఉంటాయి. కానీ ఒక్క మనిషిలో మాత్రమే ఈ లక్షణాలన్నీ ఉండటం విశేషం. మనిషికి మంచి లక్షణాలుంటే పర్వాలేదు. కానీ అవలక్షణాలు ఉంటేనే సమాజానికి ప్రమాదం.
జగన్ శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టి పులివెందులలో విశ్రాంతి తీసుకుందామని వెళితే, అక్కడ కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది!
చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు తీరిక దొరకడంతో, నియోజకవర్గంలో ప్రజలను ఓసారి పలకరిద్దామనుకుంటే, పెండింగ్ బిల్లులు పట్టుకొని గుత్తేదారులు జగన్ ప్యాలస్‌కు క్యూ కట్టారు. కొంతమందికి నచ్చజెప్పి పంపించేస్తే మరో బ్యాచ్ వస్తూనే ఉంది.
ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా వైసీపికి చెందిన కొంతమంది నేతలకు చెందిన సంస్థలకు పెండింగ్ బిల్లులు చెల్లించేశారని, తమని ఎందుకు మోసం చేశారని వారు జగన్‌ని నిలదీసిన్నట్లు సమాచారం.
పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా) కింద జరిగిన పనులలో కొన్ని మాత్రమే ప్రజలకు ఉపయోగపడేవి కాగా మిగిలినవన్నీ వైసీపి నేతలు, కార్యకర్తలు, వైసీపి గుత్తేదారుల కోసమే అన్నట్లు అవసరం లేని, చేయని పనులకు బిల్లులు జగన్ ప్రభుత్వం బిల్లులు చెల్లించేసింది.
ఈ నమ్మకంతోనే మనకీ వెంటనే డబ్బులు వచ్చేస్తాయనే నమ్మకంతో కొందరు జేబులో డబ్బు ఖర్చు చేసి పనులు చేయిస్తే, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారి పరిస్థితి అయోమయంగా మారింది.
పులివెందులలో గత 5 ఏళ్ళలో జరిగిన, జరిగిన్నట్లు చూపించిన పనులు, వాటికి జగన్ ప్రభుత్వం చెల్లించిన బిల్లులపై విచారణ జరిపించేందుకు సిద్దం అవుతుండటంతో గుత్తేదారులు, వారితో కుమ్మక్కయిన అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయిప్పుడు.
జగన్‌ని నమ్ముకొని జేబులో డబ్బు ఖర్చు చేస్తే అది తిరిగి రాకపోగా ఇప్పుడు ఈ విచారణ, కేసులు కూడా మెడకు చుట్టుకునే ప్రమాదం కనిపిస్తుండటంతో గుత్తేదారులు పులివెందుల వచ్చిన జగన్, భారతి దంపతులను కలిసి వీటి గురించి గట్టిగా నిలదీసిన్నట్లు తెలుస్తోంది. వారి గోల భరించలేక జగన్ దంపతులు సోమవారం హెలికాఫ్టర్‌లో బెంగళూరుకు వెళ్ళిపోయారు.
ఇదివరకు తెలంగాణలో తనను నమ్ముకున్న వైసీపి నేతలు, కార్యకర్తలను జగన్ రోడ్డున పడేసి ఏపీకి వచ్చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులలో మంత్రులు, అధికారులు ఇలాగే నష్టపోయారు.
అవన్నీ చూసి కూడా ప్రజలు ఆయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వడమే విచిత్రం అనుకుంటే, తల్లిని, చెల్లిని కూడా బయటకు గెంటేసిన ఆయన, తమకు మాత్రం తప్పక మేలు చేస్తారని, కాపాడుతారనుకోవడం ఇంకా విచిత్రం.
జగన్‌ని నమ్ముకున్న వైసీపి నేతలు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు, అధికారులు, వాలంటీర్లు అందరూ లబోదిబోమంటున్నారిప్పుడు.
జగన్ ఇటీవల తాడేపల్లి ప్యాలస్‌లో పార్టీ నేతలతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు కోట్ల మంది ప్రజలను మనల్నే నమ్ముకున్నారని, మనం పక్కకు తప్పుకుంటే అన్యాయం అయిపోతారన్నారు. కానీ గుత్తేదారులను, 1.08 లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేసి బెంగళూరు వెళ్ళిపోయారు. కనీసం ఇప్పటికైనా అందరికీ కనువిప్పు కలుగుతుందో లేదో?




